అనాథలను ఆదుకుంటాం

Jun 16 2021 @ 00:00AM
నిత్యావసర వస్తువులను పంపిణీ జిల్లా శిశుసంక్షేమాధికారి మోతి

  • రంగారెడ్డి జిల్లా శిశుసంక్షేమాధికారి మోతి 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 18ఏళ్లలోపు పిల్లలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని జిల్లా శిశు సంక్షేమాధికారి మోతి తెలిపారు. శిశుసంక్షేమ, గూంజ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కరోనాతో ఆర్థికంగా నష్టపోయిన చైల్డ్‌కేర్‌ ఇనిస్టిట్యూషన్స్‌ల బాల, బాలికలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతల సహాయంతో నెలకు అవసరమైన నిత్యావసర వస్తు వులను అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో హర్శవర్ధిని, ప్రవీణ్‌కుమార్‌, రవి కుమార్‌ దేవేంద్రచారి, ప్రమీల, ప్రగతి, శేఖర్‌, వాసు పాల్గొన్నారు. Follow Us on: