కొత్త వారికి పంట రుణాలు అందజేస్తాం

ABN , First Publish Date - 2021-07-27T04:36:54+05:30 IST

కొత్త వారికి పంట రుణాలు అందజేస్తాం

కొత్త వారికి పంట రుణాలు అందజేస్తాం

పరిగి(రూరల్‌): పరిగి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో కొత్త రైతులకు పంట రుణాలు అందజేయనున్నట్లు పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్యాంమ్‌సుందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కార్యాలయంలో  సమావేశం నిర్వహించారు. రైతులకు స్వల్ప కాలిక రుణాలతో పాటు  దీర్ఘకాలిక రుణాల కింద గేదెలు, గొర్రెలు, ట్రాక్టర్లు, పౌలీ్ట్రఫాం వంటి వాటికి రుణాలు ఇవ్వనున్నట్లు తీర్మాణించారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు భాస్కర్‌, డైరెక్టర్లు మాణిక్యం, హన్మంత్‌రెడ్డి, భోజ్యానాయక్‌, శ్రీనివాస్‌, దామోధర్‌రెడ్డి, ఈశ్వరప్ప సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T04:36:54+05:30 IST