అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2021-07-27T03:43:50+05:30 IST

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, కలెక్టర్‌ హరీశ్‌, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు
నర్సాపూర్‌లో రేషన్‌ కార్డును అందజేస్తున్న మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌, కలెక్టర్‌, ఎమ్మెల్యే

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, కలెక్టర్‌ హరీశ్‌, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

నర్సాపూర్‌లో రేషన్‌కార్డుల పంపిణీ


నర్సాపూర్‌, జూలై 26: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, కలెక్టర్‌ హరీశ్‌, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన 1,278 మందికి నూతన రేషన్‌ కార్డులను నర్సాపూర్‌లోని ఓ గార్డెన్‌లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్టవ్యాప్తంగా కొత్తగా మూడు లక్షల తొమ్మిది వేల కొత్త రేషన్‌ కార్డులను ప్రభుత్వం ఇస్తుందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రకంగా లబ్ధి చేకూరుతుందన్నారు. నియోజకవర్గంలో ఇంకా రాని వారికి కూడా రేషన్‌ కార్డులు త్వరలోనే మంజూరు చేయిస్తామన్నారు.                                                            

 జిల్లాలో 3,368 కొత్త రేషన్‌ కార్డులు: కలెక్టర్‌ హరీశ్‌

మెదక్‌ జిల్లాలో కొత్తగా 3,368 రేషన్‌ కార్డులను మంజూరు చేసినట్లు కలెక్టర్‌ హరీశ్‌ తెలిపారు. నర్సాపూర్‌లో నిర్వహించిన రేషన్‌కార్డుల పంపిణీలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్తగా ఇచ్చిన రేషన్‌ కార్డుల లబ్ధిదారులకు కూడా వచ్చే నెల నుంచి రేషన్‌ బియ్యం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.  ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడేందుకు తమవంతు ప్రయ త్నం చేయాలన్నారు. నర్సాపూర్‌ అటవీ ప్రాంతంలో కూడా ప్లాస్టిక్‌ వ్యర్థాలు వేస్తున్నారని, ఇది తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రమేశ్‌, లేబర్‌ వెల్ఫేరు బోర్డు చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ అనుసూయఅశోక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజుయాదవ్‌, ఆత్మకమిటీ చైర్మన్‌ శివకుమార్‌, తహసీల్దార్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు పాల్గొన్నారు. 

 దేశానికి ఆదర్శం తెలంగాణ

హత్నూర, జూలై 26: దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం హత్నూర మండలం దౌల్తాబాద్‌ సమీపంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో  రేషన్‌ కార్డులను, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... హత్నూర మండలానికి 395 కొత్త తెల్ల రేషన్‌ కార్డులు, 81 కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి షఫి, ఎంపీపీ నర్సింహులు, జడ్పీటీసీ ఆంజనేయులు, పీఏసీఎస్‌ చైర్మన్లు దుర్గారెడ్డి, దామోదర్‌రెడ్డి, తహసీల్దార్‌ పద్మావతి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు రాజేందర్‌, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ బుచ్చిరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

 ప్రతి పేదోడికి ఆహార భద్రత కార్డులు: ఎమ్మెల్యే పద్మారెడ్డి 

చిన్నశంకరంపేట/ మెదక్‌ మున్సిపాలిటీ/రామాయంపేట/నిజాంపేట/పాపన్నపేట, జూలై 26: ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చిన్నశంకరంపేట మండల పరిషత్‌ కార్యాలయంలో వంద మంది లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేదోడికి ప్రభుత్వం ఆహార భద్రత కార్డులను మంజూరు చేసిందన్నారు. మెదక్‌ నియోజకవర్గంలో 933 మందికి ఆహర భద్రత కార్డులను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సాయిరాం, డీఎ్‌సవో శ్రీనివాస్‌, ఎంపీపీ భాగ్యలక్ష్మి, జడ్పీటీసీ మాధవి, తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావు, ఎంపీడీవో గణే్‌షరెడ్డి, మాజీ ఎంపీపీ పాండరిగౌడ్‌, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాజు, డీసీఎంఎస్‌ మాజీ డైరెక్టర్‌ గోపాల్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కాగా మెదక్‌లోని ఓ గార్డెన్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి లబ్ధిదారులకు రేషన్‌కార్డులను మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ లావణ్యారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌, మాజీ వైస్‌ చైర్మన్‌ రాగి అశోక్‌, కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు. రామాయంపేటలోని ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు రేషన్‌ కార్డులను మంజూరు చేశారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌, వైస్‌చైర్మన్‌ పుట్టి విజయలక్ష్మి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సరాఫ్‌ యాదగిరి, సొసైటీ చైర్మన్‌ చంద్రం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిజాంపేటలోని సబ్‌మార్కెట్‌లో సోమవారం 40 కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు, 120 రేషన్‌ కార్డులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అందజేశారు. అనంతరం చల్మెడ గ్రామంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్త మంగలి సత్తయ్య ప్రమాదవశాత్తు చనిపోవడంతో వారి కుటుంబానికి పార్టీ సభ్యత్వ బీమా రూ.2లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, వైస్‌ ఎంపీపీ ఇందిరాకొండల్‌రెడ్డి, ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్‌ జయరాములు, మున్సిపల్‌ చైర్మన్‌ జితేందర్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సరాఫ్‌ యాదగిరి, సర్పంచ్‌ అనూష పాల్గొన్నారు. పాపన్నపేటలో 233 కొత్త రేషన్‌కార్డులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అందజేశారు. ఆమె వెంట మెదక్‌ ఆర్డీవో సాయిరాం, డీఎ్‌సవో శ్రీనివాస్‌, జిల్లా రైతు సమన్వయ అధ్యక్షుడు సోములు, జడ్పీటీసీ షర్మిలా శ్రీనివాస్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ విష్ణువర్ధన్‌రెడ్డి, తహసీల్దార్‌ లక్ష్మణ్‌, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు జగన్‌, ఎంపీటీసీ శ్రీనివాస్‌, గౌస్‌, సర్పంచులు  పాల్గొన్నారు.



పేదలను ఆదుకోవడానికి కృషి: ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

కల్హేర్‌/నారాయణఖేడ్‌, జూలై 26: పేద ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగా అర్హులైన పేదలకు రేషన్‌ కార్డులు అందజేస్తున్నదని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. కల్హేర్‌లోని రైతు వేదికలో సోమవారం నూతన రేషన్‌ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అంబదాస్‌ రాజేశ్వర్‌, రైతు బంధు జిల్లా కోఆర్డినేటర్‌ వెంకట్‌రాంరెడ్డి, ఖేడ్‌ ఆత్మ చైర్మన్‌ రాంసింగ్‌, కల్హేర్‌ జడ్పీటీసీ నర్సింహరెడ్డి, తహసీల్దార్‌ జయరాం, నాయకులు జలందర్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా ఖేడ్‌లో 290 మందికి నూతన రేషన్‌ కార్డులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ దశరత్‌సింగ్‌, జడ్పీటీసీ లక్ష్మీబాయి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పరశురాం, కౌన్సిలర్లు మాజీద్‌, నాయకులు పాల్గొన్నారు. 

సంక్షేమ రంగానికి పెద్దపీట 

-శాసనమండలి చైర్మన్‌ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు, జూలై 26: రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగిస్తూనే సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నదని శాసనమండలి చైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం పటాన్‌చెరులోని జీఎంఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో 757 రేషన్‌ కార్డులు, 112 కల్యాణలక్ష్మి, షాదీముబాకర్‌ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గూడెంమహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా పటాన్‌చెరు నియోజకవర్గానికి 2,222 రేషన్‌ కార్డులు మంజూరయ్యాయన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ మెట్టుకుమార్‌యాదవ్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీకాంత్‌రెడ్డి, ఆర్డీవో నగేష్‌, ఎంపీపీ సుష్మ, జడ్పీటీసీ సుప్రజ, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ హారికవిజయ్‌కుమార్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T03:43:50+05:30 IST