ఏ జబ్బుకు ఏ వైద్యులు?

Published: Tue, 14 Dec 2021 16:16:13 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఏ జబ్బుకు ఏ వైద్యులు?

ఆంధ్రజ్యోతి(14-12-2021)

చికిత్స చేసే వాళ్లందర్నీ వైద్యులనే పిలుస్తాం. అలాగని అన్ని రకాల రుగ్మతలకూ ఒకే వైద్యుడిని కలిసే పరిస్థితి ఉండదు. లక్షణాలను బట్టి, రుగ్మత స్వభావాన్ని బట్టి ఆ కోవకు చెందిన అనుభవజ్ఞులైన వైద్యులను ఎంచుకోవాలి. ఎలాంటి ఆరోగ్య సమస్యలకు ఏ వైద్యులను ఎంచుకోవాలో తెలుసుకుందాం!


అలర్జిస్ట్‌/ఇమ్యునాలజిస్ట్‌: వ్యాధినిరోధక వ్యవస్థ రుగ్మతలు, ఆస్తమా, ఎగ్జీమా, ఫుడ్‌ అలర్జీలు, పురుగు కాటు అలర్జీలు, ఆటోఇమ్యూన్‌ డిజార్డర్లు


ఎండోక్రైనాలజిస్ట్‌: థైరాయిడ్‌ సమస్యలు, మధుమేహం, మెటబాలిజం డిజార్డర్లు


ఫ్యామిలీ ఫిజీషియన్‌: రొటీన్‌ చెకప్స్‌, వ్యాక్సిన్లు, రుగ్మతలకు సంబంధించిన చికిత్సల పర్యవేక్షణ 


గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌: పొట్ట, పిత్తాశయం, కాలేయం, క్లోమం, కాలేయాలకు సంబంధించిన రగ్మతలు. పొట్టలో నొప్పి, అల్సర్లు, వాంతులు, విరోచనాలు, కామెర్లు మొదలైన రుగ్మతలకు ఈ వైద్యులను సంప్రతించాలి. 


హెమటాలజిస్ట్‌: రక్తం, ప్లీహం, లింఫ్‌ గ్రంథులకు సంబంధించిన రుగ్మతలైన సికెల్‌ సెల్‌ డిసీజ్‌, అనీమియా, హీమోఫీలియా, లుకేమియాలకు ఈ వైద్యులను సంప్రతించాలి.


పాలియేటివ్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌: మరణానికి చేరువలో ఉన్న వ్యక్తులు చివరి రోజుల్లో నాణ్యమైన జీవితం గడపడానికి తోడ్పడే వైద్యులు వీళ్లు. నొప్పిని తగ్గించే చికిత్సతో పాటు, ఇతర వైద్యుల సహాయంతో రోగి చివరి రోజులు సాధ్యమైనంత ఆహ్లాదంగా గడిపేందుకు అవసరమైన చికిత్సను అందిస్తారు. 


ఇన్‌ఫెక్షియస్‌ డిసీజ్‌ స్పెషలిస్ట్‌: జ్వరం, లైమ్‌ డిసీజ్‌, న్యుమోనియా, క్షయ, హెచ్‌ఐవి మొదలైన శరీరంలో ఏ అవయవానికి సంబంధించిన ఇన్‌ఫెక్షన్లను అయినా కనిపెట్టి, వాటికి తగిన చికిత్సను సూచిస్తారు. 


జెనెటిసిస్ట్‌: వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధులను ఈ వైద్యులు కనిపెట్టగలుగుతారు. జెనెటిక్‌ కౌన్సెలింగ్‌తో పాటు, స్ర్కీనింగ్‌ పరీక్షలను కూడా సూచిస్తారు.


నెఫ్రాలజిస్ట్‌: మూత్రపిండాల వ్యాధుల కోసం ఈ వైద్యులను ఎంచుకోవాలి.


ఓటోలారింగాలజిస్ట్‌: చెవి, ముక్కు, గొంతు, సైనస్‌లు, తల, మెడ, శ్వాసకోశ వ్యవస్థకు చెందిన రుగ్మతలకు ఈ వైద్యులను ఎంచుకోవాలి. 


స్లీప్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌: నిద్ర సమస్యలకు ఈ వైద్యులను ఎంచుకోవాలి.


యూరాలజిస్ట్‌: మూత్రాశయ సమస్యలు, ప్రోస్టేట్‌ పరీక్ష కోసం ఈ వైద్యులను ఎంచుకోవచ్చు.


యాండ్రాలజిస్ట్‌: పురుషుల్లో ఇన్‌ఫెర్టిలిటీ, హార్మోన్‌ సమస్యలు, జననావయవాల రుగ్మతలకు ఈ వైద్యులను సంప్రతించాలి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.