వంట చేస్తుండగా.. ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధం

Published: Wed, 25 May 2022 23:48:07 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వంట చేస్తుండగా.. ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధంకొండాపూర్‌కలాన్‌లో కాలిబూడిదైన పూరిగుడిసె

ధారూరు, మే 25 : పూరిగుడిసెలో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలంటుకుని గుడిసె పూర్తిగా  దగ్ధమైంది. ఈ ఘటన మండల పరిధిలోని కొండాపూర్‌కలాన్‌ గ్రామంలో బుధవారం సాయత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుడగజంగం ఉషనమ్మ పూరి గుడిసెలో వంట చేసుకుంటుండగా గాలికి  పొయ్యిలోని మంటలు పూరి గుడిసెకు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా గుడిసె మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో గుడిసెలో ఉన్న రూ.50 వేల నగదు, నిత్యావసర వస్తువులు, దుస్తులు, పట్టాదారు పాసుపుస్తకం, రేషన్‌ కార్డు ఇతర వస్తువులు కాలిపోయినట్లు బాధితురాలు ఉషనమ్మ తెలిపింది. ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని సర్పంచ్‌ పరమేశ్‌, కేవీపీఎస్‌ నాయకుడు లాలయ్యలు ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.