బిందెలతో మహిళల నిరసన

ABN , First Publish Date - 2021-03-06T05:50:08+05:30 IST

పెద్దకొల్లి వలస ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ పంచాయతీ పరిధిలోని స్కాట్‌పేట గ్రామానికి చెం దిన మహిళలు తాగునీటి కోసం బిందెలతో నిరసన తెలిపారు.

బిందెలతో మహిళల నిరసన
నిరసన తెల్పుతున్న మహిళలు

ఎల్‌.ఎన్‌.పేట: పెద్దకొల్లి వలస ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ పంచాయతీ పరిధిలోని స్కాట్‌పేట గ్రామానికి చెం దిన మహిళలు  తాగునీటి కోసం బిందెలతో  నిరసన తెలిపారు. ఈమేరకు శుక్ర వారం  వారంతా ఖాళీ బిందెలతో మండల పరి షత్‌ కార్యాలయం ఎదుట  నిరసనకు దిగారు.  గతంలో  పంచాయతీ పరిధిలోని కొన్ని గ్రామాలు,  కాలనీలకు మెగా రక్షిత నీటి పథకం ద్వారా కుళాయిలు ఏర్పాటు చేశారన్నారు. అయితే..  మధ్య నిర్వాసిత గ్రామాలకు చెందిన వారి కా లనీ ఇళ్లు నిర్మిస్తుండటం వల్ల వారిళ్ళకు  కొత్తగా కుళాయిలు ఏర్పా టు చేస్తుండటంతో  స్కాట్‌పేటకు తాగునీరు రావడంలేదన్నారు. దీంతో తాగునీటికి అవస్థలు పడాల్సి వస్తోందని ఎంపీడీవో కాళీ ప్రసాదరావు ఎదుట ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంబంధిత శాఖాధికారులతో మాట్లాడి తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మండల కార్యదర్శి కె. చిరంజీవి ఉన్నారు.

Updated Date - 2021-03-06T05:50:08+05:30 IST