యల్లమిల్లిలో రాష్ట్రస్థాయి ఎడ్లబండి పోటీలు

ABN , First Publish Date - 2021-03-01T05:56:48+05:30 IST

గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామంలో ఆదివారం రాష్ట్ర స్థాయి ఎడ్ల బండి పోటీలు నిర్వహించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, గ్రామ ఉప సర్పంచ్‌ కోన గంగాధర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు 33 ఎడ్ల జతలు వచ్చాయి.

యల్లమిల్లిలో రాష్ట్రస్థాయి ఎడ్లబండి పోటీలు
పోటీల్లో పరుగులు తీస్తున్న ఎడ్లబండి

 గండేపల్లి, ఫిబ్రవరి 28: గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామంలో ఆదివారం రాష్ట్ర స్థాయి ఎడ్ల బండి పోటీలు నిర్వహించారు.  జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, గ్రామ ఉప సర్పంచ్‌ కోన గంగాధర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు 33 ఎడ్ల జతలు వచ్చాయి. సీనియర్‌ విభాగంలో 5 జతలు పాల్గొనగా మొదటి స్థానంలో ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామానికి చెందిన కోరశృతిచౌదరి, రెండో స్థానం లో పెద్దాపురం మండలం ఆర్‌బీ కొత్తూరు గ్రామానికి చెందిన చుండ్రు సత్యనారాయణ, మూడో స్థానంలో గుంటూరు జిల్లా కంకన్నపాలెం గ్రామానికి చెందిన కాక హేమంత్‌కుమార్‌ విజేతలుగా నిలిచారు, జూనియర్‌ విభాగంలో 28 జతల ఎడ్లు పాల్గొనగా మొదటి స్థానంలో గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామానికి చెందిన సుంకవిల్లి రిధిక్‌ శ్రీకర్‌చౌదరి, రెండో స్థానంలో కడియం మండలం చెముడులంక గ్రామానికి చెందిన నాగిరెడ్డి అనంతలక్ష్మి, మూడో స్థానంలో పెద్దాపురం మండలం ఆర్‌బీ కొతూరు గ్రామానికి చెందిన మన్యం సత్యనారాయణ, నాలుగో  స్థానంలో రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామానికి చెందిన గంగుల భవాని రత్నమాల, ఐదో స్థానంలో ముప్పర్తిపాడు గ్రామానికి  చెందిన కొప్పాక రేవంత్‌, ఆరో స్థానంలో రాజానగరం మండలం వెలుగుబంద గ్రామానికి చెందిన కుట్టి రాకేష్‌కు చెందిన జతలు విజేతలుగా నిలిచాయి. విజేతలకు కమిటీ సభ్యులు షీల్డు, నగదు బహుమతులు అందజేశారు. పెనుమర్తి అర్జునరావు, బండి రాంబాబు, ఎస్‌.చౌదరి, ఉమ్మిడి పెద్దకాపు, మల్లేశ్వరరావు, సుబ్బరావు, ఎం.బుచ్చియ్య, పి.రమణ, వీరబాబు, చౌదరి పాల్గొన్నారు.   

Updated Date - 2021-03-01T05:56:48+05:30 IST