వైసీపీ అరాచక పాలనపై పోరాటం

ABN , First Publish Date - 2021-06-22T05:19:42+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ నిరంకుశ, ఆరాచకపాలనపై ప్రజా క్షేత్రంలో పొరాటం చేస్తామని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు.

వైసీపీ అరాచక పాలనపై పోరాటం
ఎన్టీఆర్‌ విగ్రహాం వద్ద నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు

హిందూపురం, జూన 21: రాష్ట్రంలో వైసీపీ నిరంకుశ, ఆరాచకపాలనపై ప్రజా క్షేత్రంలో పొరాటం చేస్తామని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ నూతన కమిటీ ఎన్నిక నేపథ్యంలో సోమవారం పట్టణంలోని ఎన్టీఆర్‌ కూడలిలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఒక్కఛాన్స అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రేండేళ్లలో చేసిన అభివృద్ది శూన్యమన్నారు. ప్రజల పక్షాన పొరాటం చేస్తున్న ప్రతి పక్షాల నాయకులను బెదిరింపులు, అక్రమ కేసులు బనాయించడం, చట్టాలు, న్యాయం వ్యవస్థ అంటే లెక్కలేని విధంగా వ్యవహరిస్తోందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నిరంకుశపాలన కొనసాగిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కారదర్శులు అంజినప్ప, రామాంజినమ్మ, షఫివుల్లా, దేమకేతేపల్లి అంజినప్ప, పార్లమెంట్‌ కమిటి అధికార ప్రతినిధి జేవి అనిల్‌కూమార్‌, కార్యనిర్వహక కార్యదర్శులు ఆదినారాయణ, వీరశేఖర్‌, మీడియా కోఆర్డీనేటర్‌ చంద్రమోహన, ఐటీడీపీ కోఆర్డీనేటర్‌ రామాంజినేయులు, హిందూపురం టీడీపీపట్టణ అధ్యక్షులు రమే్‌షకుమార్‌, లేపాక్షి, చిలమత్తూరు మండల కన్వీనర్లు జయప్ప, రంగారెడ్డి, ఖాధీ బోర్డు మాజీ డైరెక్టర్‌ పాపన్న, టీడీపీ నాయకులు అమర్‌నాథ్‌, ప్రెస్‌ వెంకటేశులు, నెట్టప్ప, హెచఎం రాము, కిష్టప్ప, దుర్గానవీన, హిదయతుల్లా, నాగేంద్ర, నజీర్‌, విశ్వనాథరెడ్డి, టైలర్‌ గంగాధర్‌, భాస్కర్‌, డైమండ్‌బాబా, మాలక్క, అనిల్‌, సురేష్‌, నాగార్జున, నాగరాజుతోపాటు టీడీపీ కార్యకర్తలు, అనుబంఽధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-22T05:19:42+05:30 IST