Share News

BANDARU SHRAVAISHREE : టీడీపీ విజయాన్ని ఆపలేరు

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:59 PM

టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆ పార్టీ కూటమి అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ ధీమా వ్యక్తం చేశారు. నామినేషన సందర్భంగా గురువారం శింగనమలలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు, పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. ఈ వేడుకతో శింగనమల పసుపు మయమైంది. చెరువుకట్ట ప్రాంతం, నామినేషన కార్యాలయం పరిసరాలు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ర్యాలీ సందర్భంగా డప్పులు, ...

BANDARU SHRAVAISHREE : టీడీపీ విజయాన్ని ఆపలేరు
TDP candidate Bandaru Shravanishree filing nomination in Singanamala

శింగనమల అభ్యర్థి బండారు శ్రావణి

వేలాది మందితో ర్యాలీ.. అట్టహాసంగా నామినేషన

బుక్కరాయసముద్రం/శింగనమల: టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆ పార్టీ కూటమి అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ ధీమా వ్యక్తం చేశారు. నామినేషన సందర్భంగా గురువారం శింగనమలలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు, పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. ఈ వేడుకతో శింగనమల పసుపు మయమైంది. చెరువుకట్ట ప్రాంతం, నామినేషన కార్యాలయం పరిసరాలు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ర్యాలీ సందర్భంగా డప్పులు, బాణసంచా మోత మోగింది. శింగనమల మరవకొమ్మ


వద్ద నుంచి వేలాది కార్యకర్తలు, నాయకులతో కలిసి వచ్చిన శ్రావణిశ్రీ, శింగనమల తహసీల్దార్‌ కార్యాలయంలో నామినేషన దాఖలు చేశారు. టీడీపీ శ్రేణులు భారీగా కదలిరావడంతో ర్యాలీ రెండుగంటల పాటు సాగింది. ఆమె వెంట ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిముడుగు కేశవరెడ్డి, పసుపుల హనుమంతురెడ్డి, పర్వతనేని శ్రీధర్‌బాబు, గంజేనాగరాజు, దండు శ్రీనివాసులు, సుధాకర్‌యాదవ్‌, సాకే రామకృష్ణ షాలినీదొర, డేగల కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.

ఎద్దుల బండిపై నామినేషనకు...

కాగా శింగనమల చెరువు వద్ద కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఎద్దుల బండిలో ఎక్కి నామినేషన కార్యక్రమానికి బండారు శ్రావణిశ్రీ హాజరుకావడం అందరినీ ఆకట్టుకుంది. నామినేషన కార్యక్రమానికి ముందు ఆమె పార్టీ నాయకులతో కలిసి బుక్కరాయసముద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఇసుక అక్రమార్కుడు.. వీరాంజి

వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు టిప్పర్‌ డ్రైవర్‌ కాదని, ఇసుక అక్రమార్కుడని బండారు శ్రావణిశ్రీ విమర్శించారు. వీరాంజనేయులు టిప్పర్‌ డ్రైవర్‌ అంటూ నకిలీ ప్రచారం చేస్తున్నారన్నారు. అసలు నిజం ఎన్నికల అఫిడవిట్‌లో తేలిందన్నారు. సిటింగ్‌ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డి ఇంటికి ఈయన బినామీ అని ఆరోపించారు.


నియోజకవర్గంలో ఇసుక అక్రమంగా తరలించి కోట్లాది రూపాయలు ఎమ్మెల్యే కుటుంబం దోచుకోవడానికి దోహదపడ్డాడన్నారు. అందుకు కృతజ్ఞతగానే ఎమ్మెల్యే టిక్కెట్టు ఇప్పించుకున్నారని ఆరోపించారు. వీరాంజనేయులకు ఓటు వేస్తే నియోజకవర్గంలో ఇసుక రీచలు, వంకలు, కొండ గుట్టలు లేకుండా చేస్తారని ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో టీడీపీకి ఓటువేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శింగనమల సహా రాష్ట్రంలో టీడీపీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని అన్నారు. అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని అన్నారు. అంబేడ్కర్‌ ఆశయ సాధనకు పాటుపడతామని, ఆయన స్ఫూర్తితో నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 25 , 2024 | 11:59 PM