Share News

PARITALA SUNITA : రాప్తాడులో టీడీపీ జెండా ఎగరేస్తాం..!

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:56 PM

రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి పరిటాల సునీత, పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌ ధీమా వ్యక్తం చేశారు. రాప్తాడులో టీడీపీ కూటమి అభ్యర్థిగా పరిటాల సునీత గురువారం నామినేషన దాఖలు చేశారు. తమ స్వగ్రామం వెంకటాపురంలో పరిటాల శ్రీరామ్‌, పరిటాల సిద్దార్థ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఎల్లమ్మ అలయంలో, పరిటాల రవీంద్ర ఘాట్‌ వద్ద పూజలు ..

PARITALA SUNITA : రాప్తాడులో టీడీపీ జెండా ఎగరేస్తాం..!
Paritala Sunitha presenting the nomination papers to the Returning Officer

టీడీపీ కూటమి అభ్యర్థి పరిటాల సునీత

అట్టహాసంగా నామినేషన.. భారీ బహిరంగ సభ

రాప్తాడు, ఏప్రిల్‌ 25: రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి పరిటాల సునీత, పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌ ధీమా వ్యక్తం చేశారు. రాప్తాడులో టీడీపీ కూటమి అభ్యర్థిగా పరిటాల సునీత గురువారం నామినేషన దాఖలు చేశారు. తమ స్వగ్రామం వెంకటాపురంలో పరిటాల శ్రీరామ్‌, పరిటాల సిద్దార్థ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఎల్లమ్మ అలయంలో, పరిటాల రవీంద్ర ఘాట్‌ వద్ద పూజలు చేశారు. అనంతరం భారీ కాన్వాయ్‌తో రాప్తాడు తహసీల్దార్‌ కార్యాలయానికి బయలు దేరారు.


రామగిరి, ఎనఎ్‌స గేటు, మామిళ్లపల్లి, మరూరు తదితర గ్రామాల్లో టీడీపీ శ్రేణులతో పరిటాల సునీతకు ర్యాలీ కొనసాగింది. ఉదయం 11:30 గంటలకు పరిటాల సునీత రాప్తాడుకు చేరుకుని తహసీల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి వసంతబాబుకు నామినేషన పత్రం అందచేశారు. అనంతరం పరిటాల సునీత, శ్రీరామ్‌ ప్రచార రథం ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. వారిని నాయకులు, కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. అక్కడి నుంచి రాప్తాడులో సమీపంలో పంజాబీ డాబా వద్ద గల సభా స్థలానికి చేరుకున్నారు. హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి సభలో పాల్గొన్నారు.

మరింత అభివృద్ధి చేస్తాం: పరిటాల సునీత

‘‘రాప్తాడు నియోజకవర్గం టీడీపీ కంచుకోట. ఇక్కడి ప్రజలు మా కుటుంబాన్ని ఏళ్ల నుంచి ఆదరిస్తున్నారు. మా ప్రాణం ఉన్నన్నాళ్లూ మీకు సేవ చేసినా.. మీ రుణం తీర్చుకోలేము. 2014 నుంచి 2019 వరకూ మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. చెరువుకు నీరు అందించి రైతులకు అండగా నిలిచాం. రూ.5 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. అధికారంలోకి వచ్చాక ప్రతి ఎకరానికీ సాగునీరు ఇస్తాం. సోలార్‌హబ్‌ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. జాకీ పరిశ్రమ స్థానంలో పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తాం. అనంతపురం రూరల్‌ మండలంలో తాగునీటి సమస్య పరిష్కరించి, ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తాం.


పేరూరు కాలువకు భూములిచ్చిన రైతులకు మార్కెట్‌ విలువ ప్రకారం నష్టరిహారం అందిస్తాం. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం. ప్రకా్‌షరెడ్డి గత ఎన్నికల్లో 32 వేల దొంగ ఓట్లతో గెలిచాడు. టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే ప్రకాష్‌ రెడ్డిని మీసం మెలేసి నిలదీయండి. ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశాడో చెప్పమనండి. నామినేషన వేసినప్పుడు పరిటాల, చంద్రబాబు ఆస్తులను ప్రజలకు పంచుతామని చెప్పాడు. ప్రకా్‌షరెడ్డీ.. నువ్వు మగాడివైతో మా ఆస్తులు పంచు. ఎవరి ఆస్తులు ఎవరు పంచుతారో జూన 4న తెలుస్తుంది. పరిటాల రవి కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. ఒక్క సారి గెలిచినందుకు పెద్ద పుడింగి లాగా ఫీలవుతున్నావ్‌. ఎన్నికల్లో ఓడిపోతే మీసం తీయించుకుంటానని అన్నావ్‌. బ్లేడు తీసుకుని సిద్ధంగా ఉండు..’’

బ్లేడ్‌తో సిద్ధంగా ఉండు: పరిటాల శ్రీరామ్‌

‘‘30 ఏళ్ల నుంచి ప్రజలు మా కుటుంబానికి అండగా ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా మా గెలుపుకు కృషి చేస్తున్నారు. 20 రోజులు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఈ పడగొడతారు. ఎన్నికల్లో ఓడితే మీసం గీయించుకుంటానని ప్రకా్‌షరెడ్డి శపథం చేశాడు. మీసం తీయించుకునే టైం దగ్గరికి వచ్చింది. బ్లేడుతో సిద్ధంగా ఉండు ప్రకాష్‌ రెడ్డీ..! ఈ నామినేషన చూస్తేనే ప్రకా్‌షరెడ్డికి అర్థమయింటుంది. మా ఆస్తులు పంచుతానని అంటున్నావ్‌. ఫలితాల తర్వాత నీ అక్రమ ఆస్తులు ప్రజలు ఖచ్చితంగా కొల్లగొడతారు. రాజకీయాలను నీచంగా మార్చిన పనికిమాలిన వ్యక్తి ప్రకా్‌షరెడ్డి. ప్రకా్‌షరెడ్డి పద్ధతి మార్చుకోవాలి. పరిటాల కుటుంబం గురించి ఇష్టానుసారం మాట్లాడొద్దు. ఐదేళ్లు పడిన కష్టాలను, గ్రామాల్లో సమస్యలను ప్రజలు గుర్తు తెచ్చుకోవాలి. దుర్మార్గపు పాలనం అంతం చేయడానికి సైకిల్‌ గుర్తుకు ఓటేయాలి.


అన్నింటా గెలుపు టీడీపీదే

బీకే పార్థసారథి, హిందూపురం ఎంపీ అభ్యర్థి

‘‘హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలుపు ఖాయం. ప్రకా్‌షరెడ్డి నామినేషన కంటే పరిటాల సునీత నామినేషనకు భారీగా జనాలు వచ్చారు. ఈ స్పందన చూస్తుంటే ఎంత మెజార్టీ వస్తుందో ఊహించుకోవచ్చు. పరిటాల సునీత మంత్రిగా ఉన్నప్పుడు రాప్తాడులో ఎంత అభివృద్ధి చేశారో నేను చూశాను. పరిటాల సునీతను మరోసారి గెలిపించుకుంటే రాప్తాడు మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి, దుర్మార్గపు పాలన ఉంది. రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టారు. రాప్తాడులో ప్రకా్‌షరెడ్డి చేసిన అభివృద్ధి శూన్యం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలి. సైకో పాలనను తరిమి కొట్టేందుకే కూటమి ఏర్పడింది. ప్రతి నాయకుడు, కార్యకర్త సైనికుల్లా పని చేయాలి. పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తుంచుకుంటాం. సమయం లేకపోవడం వలన అన్ని గ్రామాలకు రాలేకపోతున్నాం. గెలిచిన తరువాత ప్రతి గ్రామానికి వస్తాను. సమస్యలు పరిష్కరించి రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 25 , 2024 | 11:56 PM