Share News

AP Elections 2024: ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేత జంప్..

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:46 PM

Dokka Manikya Vara Prasad: మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనుండగా.. వైసీపీకి(YSRCP) బిగ్ షాక్ తగిలింది. గుంటూరు(Guntur) జిల్లాకు చెందిన కీలక నేతల వైసీపీకి రాజీనామా చేశారు. ఇంతకీ ఆ కీలక నేత ఎవరు? ఎందుకు రాజీనామా చేశారో తెలుసుకుందాం. ఎన్నికల వేళ వైసీపీకి ఊహించని ఝలక్ ఇచ్చారు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్(Dokka Manikya Vara Prasad). వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు..

AP Elections 2024: ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేత జంప్..
YSRCP

Dokka Manikya Vara Prasad: మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనుండగా.. వైసీపీకి(YSRCP) బిగ్ షాక్ తగిలింది. గుంటూరు(Guntur) జిల్లాకు చెందిన కీలక నేతల వైసీపీకి రాజీనామా చేశారు. ఇంతకీ ఆ కీలక నేత ఎవరు? ఎందుకు రాజీనామా చేశారో తెలుసుకుందాం. ఎన్నికల వేళ వైసీపీకి ఊహించని ఝలక్ ఇచ్చారు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్(Dokka Manikya Vara Prasad). వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను తాడేపల్లి(Thadepalli) పెద్దలకు పంపించారు డొక్కా. వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ఉన్నారు. అయితే, గత కొంత కాలంగా వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న డొక్కా.. అదును చూసి దెబ్బ వేశారు. ఎన్నికల ముంగిట పార్టీకి రిజైన్ చేశారు. డొక్కా రాజీనామాతో వైసీపీలో తీవ్ర అలజడి నెలకొంది.


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డొక్క మాణిక్య వరప్రసాద్ కీలక నేతగా ఎదిగారు. 2004 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. మంత్రిగా కూడా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం డొక్కా టీడీపీలో చేరారు. ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2020లో ఆయన వైసీపీలో చేరారు. వైసీపీ అధిష్టానం ఆయనకు ఎమ్మెల్యే పదవి ఇచ్చింది. అయితే, గత కొంత కాలంగా పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న డొక్కా.. ఇప్పుడు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. డొక్కా మాణిక్యవర ప్రసాద్ త్వరలోనే టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 26 , 2024 | 12:52 PM