Share News

AP Elections: ఏపీలో సర్వేల ప్రకంపనలు.. సోషల్ మీడియాలో వైరల్..!

ABN , Publish Date - May 06 , 2024 | 02:29 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌కు సరిగ్గా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. అన్ని పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం. గెలిచేదెవరు.. ఓడేదెవరు.. చర్చంతా ఇదే. ఈ సమయంలో సోషల్ మీడియాలో కొన్ని సర్వేలు హల్‌చల్ చేస్తున్నాయి. దాదాపు ఓ 10 నివేదికలు పలు సర్వే సంస్థల పేర్లతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఏ ఫలితం చూసినా ఒకేలా ఉండటంతో రాజకీయ పార్టీల్లో వణుకు మొదలైనట్లు తెలుస్తోంది.

AP Elections: ఏపీలో సర్వేల ప్రకంపనలు.. సోషల్ మీడియాలో వైరల్..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌కు సరిగ్గా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. అన్ని పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం. గెలిచేదెవరు.. ఓడేదెవరు.. చర్చంతా ఇదే. ఈ సమయంలో సోషల్ మీడియాలో కొన్ని సర్వేలు హల్‌చల్ చేస్తున్నాయి. దాదాపు ఓ 10 నివేదికలు పలు సర్వే సంస్థల పేర్లతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఏ ఫలితం చూసినా ఒకేలా ఉండటంతో రాజకీయ పార్టీల్లో వణుకు మొదలైనట్లు తెలుస్తోంది.

AP Survey Poll Pulse.JPG


ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సర్వేలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సర్వేలపై అధికారపార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ సర్వేలన్నీ దగ్గరదగ్గరగా ఒకేలా ఉన్నాయి. కేవలం ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంతో వదిలేయకుండా.. నియోజకవర్గాలవారీ ఓట్ల శాతాన్ని ఇచ్చారు. అలాగే పురుషులు, మహిళలు, వ్యవసాయదారులు, యువత, విద్యార్థులు ఇలా వర్గాలవారీ ఎవరు ఎవరికి మద్దతు ఇస్తు్న్నారనే అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సర్వేల్లో కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేలు ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేశాయి. ఈ సర్వేలకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కానప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.

జగన్‌ అవినీతి వల్లే పోలవరం జాప్యం!


పయోనీర్స్ పేరిట

పయోనీర్స్ ప్రీపోల్ సర్వే పేరిట ఓ రిపోర్టు సామాజిక మాద్యమాల్లో ఎక్కువుగా వైరల్ అవుతోంది. ఏప్రియల్ ఒకటి నుంచి 31 ఏప్రియల్ మధ్య ఈ సర్వే చేసినట్లు రిపోర్టులో ఉంది. దాదాపు 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాల్లో సర్వే చేయగా.. ఒక్కో శాసనసభ నియోజకవర్గం పరిధిలో 400 నుంచి 500 శాంపిల్స్ సేకరించామని, కంప్యూటర్ అసిస్టెడ్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా ఈ సర్వే చేసినట్లు ఆ నివేదికలో ఉంది. సీట్ల పరంగా ఎన్డీయే కూటమి 119 అసెంబ్లీ, 19 లోక్‌సభ సీట్లలో గెలిచే అవకాశం ఉండగా..వైసీపీ 46 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే రిపోర్టులో ఉంది. 10 శాసనసభా స్థానాల్లో గట్టి పోటీ ఉందని పేర్కొంది. ఓట్ల శాతానికి సంబంధించి అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీయేకు 49 శాతం, వైఎస్సార్‌సీపీకి 41 శాతం, ఇండియా కూటమికి 3 నుంచి 4 శాతం, ఇతరులకు 1 నుంచి 2 శాతం ఓట్లు రావొచ్చని, 4 నుంచి 5 శాతం ఇప్పటికీ ఎటూ తేల్చుకోలేని ఓటర్లు ఉన్నారని ఈ సంస్థ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సర్వేలో తేలింది.

APRIL 1st to APRIL 20th (1)_page-0027.jpg


లోక్‌సభ స్థానాలవారీ..

పయోనీర్స్ పేరిట వైరల్ అవుతున్న సర్వేలో లోక్‌సభ స్థానాల్లో ఎవరికి ఎంత శాతం ఓట్లు వస్తాయి.. లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయో ఈ సర్వే తెలిపింది. పార్లమెంట్ స్థానాలవారీ ఓట్ల శాతం కింది విధంగా ఉన్నాయి.

APRIL 1st to APRIL 20th (1)_page-0024.jpgAPRIL 1st to APRIL 20th (1)_page-0023.jpgAPRIL 1st to APRIL 20th (1)_page-0021.jpgAPRIL 1st to APRIL 20th (1)_page-0020.jpgAPRIL 1st to APRIL 20th (1)_page-0004.jpg


ఐప్యాక్‌తో పాటు మరిన్ని సంస్థల పేరుతో..

ఐప్యాక్ ఫైనల్ సర్వే పేరుతో ఒక సర్వే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఐప్యాక్ పేరు ఉండటంతో ఈ సర్వే ఎక్కువుగా వైరల్ అవుతోంది. ఈ నివేదిక ప్రకారం ఎన్డీయే కూటమికి 118, వైఎస్సార్‌సీపీకి 39 సీట్లు రావొచ్చని, 18 చోట్ల టఫ్ ఫైట్ ఉండొచ్చని ఈ సంస్థ అంచనా వేసినట్లు నివేదికలో ఉంది. బిఫ్రాంక్ పేరిట వైరల్ అవుతున్న మరో సర్వేలో వైసీపీకి 39 సీట్లు వచ్చే అవకాశం ఉందని, ఎన్డీయే కూటమికి 118 సీట్లు వస్తాయని, 18 చోట్ల పోటాపోటీ ఉంటుందని తెలిపింది. మైండ్‌షేర్ యునైటెడ్ పేరుతో వైరల్ అవుతున్న సర్వేలో వైసీపీకి 142 సీట్లు, ఎన్డీయే కూటమికి 33 సీట్లు వస్తాయని తెలిపింది. ఇంటిలిజెన్స్ బ్యూరో పేరిట వైరల్ అవుతున్న మరో సర్వేలో టీడీపీ 105, వైఎస్సార్‌సీపీ 47, జనసేన 16, బీజేపీ 5, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.


null

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సర్వేలతో జనం సైతం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోలేకపోతున్నారు. కానీ ఏ సర్వే చూసినా టీడీపీ కూటమికే ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెబుతున్నాయి. అసలు ఫలితం తెలియాలంటూ జూన్4 వరకు వెయిట్ చేయాల్సిందే.


నోట్: ఈ వార్తలో పేర్కొన్న సర్వే ఫలితాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవి మాత్రమే. ఈ వివరాలతో ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం సామాజిక మాద్యమాల్లో వస్తున్న సమాచారమని తెలియజేసే ఉద్దేశంతోనే ఈ వివరాలు ఇస్తున్నాం. ఈ సర్వేలకు మా సంస్థకు ఎటువంటి సంబంధం లేదు.

AP Elections: జగన్‌ను ఎలా నమ్మాలి.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సూటి ప్రశ్న!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 07 , 2024 | 01:54 PM