Share News

AP Elections 2024: వారు నాపై దాడికి ప్లాన్ చేశారు.. జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Apr 28 , 2024 | 02:54 PM

కొంతమంది తనపై దాడికి ప్లాన్ చేశారని జై భారత్ నేషనల్ పార్టీ (Jai Bharat National Party) అధ్యక్షుడు లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) సంచలన ఆరోపణలు చేశారు. తాను సీబీఐ జేడీగా ఉన్నప్పుడు ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడంతో కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చిందన్నారు.ఆ వ్యక్తి అభిమానులు ఇప్పుడు తనపై ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు.

AP Elections 2024: వారు నాపై దాడికి ప్లాన్ చేశారు.. జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు
JD Lakshminarayana

విశాఖపట్నం: కొంతమంది తనపై దాడికి ప్లాన్ చేశారని జై భారత్ నేషనల్ పార్టీ (Jai Bharat National Party) అధ్యక్షుడు లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) సంచలన ఆరోపణలు చేశారు. తాను సీబీఐ జేడీగా ఉన్నప్పుడు ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడంతో కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చిందన్నారు.ఆ వ్యక్తి అభిమానులు ఇప్పుడు తనపై ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో తనపై దాడి చేయడానికి నదరు వ్యక్తి అనుచరులు ప్లాన్ చేశారన్నారు. అందుకే అన్ని ఆధారాలు సేకరించి విశాఖ సీపీకి ఫిర్యాదు చేశానని తెలిపారు.


AP Elections 2024: ఏపీ రాజకీయాలపై జయప్రద ఇంట్రస్టింగ్ కామెంట్స్..

తనకు భద్రత ఇవ్వమని పోలీసులను కోరలేదని.. తగిన చర్యలు తీసుకోవాలని మాత్రమే ఫిర్యాదు చేశానని అన్నారు. విశాఖలోని జై భారత్ నేషనల్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నాడు పలువురు లక్ష్మీనారాయణ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... ఏపీని సీఎం జగన్ రెడ్డి (CM Jagan) అప్పుల్లో ముంచారని ధ్వజమెత్తారు.వైసీపీ అధికారంలోకి రాకముందు రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయి?.. ఇప్పుడు ఎంత ఉన్నాయో జగన్ చెప్పాలని ప్రశ్నించారు.


AP Elections 2024: ఓటు ఎవరికి వేశామో తెలుసుకోవచ్చు.. రండి ఇలా చెక్ చేసుకోండి!!

మద్యపాన నిషేధం చేసినా .. తర్వాతే ఓట్లు అడుగుతానని జగన్ అన్నారని.. మరి అలా చేయకుండా జగన్ ఇప్పుడు ఎందుకు ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీతో సహా అన్ని పార్టీలు తమ వైఖరి చెప్పాలన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హమీలను అన్నీ అమలు చేస్తామని రాజకీయ పార్టీలు స్టాంప్ పేపర్ మీద రాసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. తమ పార్టీ నేతలు గాజువాక, విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయమని చెప్పారని అన్నారు. స్టీల్ ప్లాంట్ అంశంపై కోర్టులో పిల్ వేశానని చెప్పారు. తాను రాజకీయ లబ్ధి పొందకూడదనే ఉదేశ్యంతోనే గాజువాకలో పోటీ చేయలేదని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.


ఇవి కూడా చదవండి

AP Elections: నీ అభిమానానికి ఫిదా.. చంద్రబాబు కోసం ఈయన ఏం చేశాడంటే..

Sharmila: సీఎం జగన్.. లాయర్ పొన్నవోలు మధ్య క్విడ్ ప్రోకో

Read Latest Andhra pradesh News or Telugu News

Updated Date - Apr 28 , 2024 | 03:37 PM