Share News

AP News: సీఎం జగన్ కాన్వాయ్ కింద పడ్డ కుక్క.. ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లో శునకం

ABN , Publish Date - Apr 28 , 2024 | 04:28 PM

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద కుక్క పడింది. తాడేపల్లి నుంచి కర్నూల్ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గన్నవరం మండలం కేసరపల్లి వద్ద జాతీయ రహదారిపై చేసుకుంది.

AP News: సీఎం జగన్ కాన్వాయ్ కింద పడ్డ కుక్క.. ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లో శునకం

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan)0 కాన్వాయ్ కింద కుక్క పడింది. తాడేపల్లి నుంచి కర్నూల్ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గన్నవరం మండలం కేసరపల్లి వద్ద జాతీయ రహదారిపై చేసుకుంది. ఈ ఘటనలో కుక్కకు గాయాలవడంతో సీఎం వ్యక్తిగత సెక్యూరిటీ కుక్కను ఆస్పత్రికి తరలించాలంటూ గన్నవరం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.


దీంతో కదలిని గన్నవరం పోలీసులు శునకాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం అక్కడి నుంచి గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గాయాలపాలైన కుక్క ప్రస్తుతం స్టేషన్‌లోనే భద్రంగా ఉంది. గాయాలు పూర్తిగా నయం అయ్యే వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ గన్నవరం పోలీసులకు సీఎం సెక్యూరిటీ ఆదేశించారు. దీంతో పోలీసులు కుక్కను జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

Read Latest AP News and Telugu News

Updated Date - Apr 28 , 2024 | 04:29 PM