Share News

Alert: మే 2024లో మారనున్న బ్యాంక్ రూల్స్.. తెలుసా మీకు?

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:31 AM

ప్రతి కొత్త నెల ప్రారంభమైనప్పుడల్లా మొదటి రోజు నుంచి అనేక ఆర్థిక నియమాలు(New Bank Rules 2024) మారుతుంటాయి. ఈ నిబంధనలు సామాన్య ప్రజలపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ఇలాంటి నేపథ్యంలో రోజువారీ జీవనంలో భాగంగా వీటి గురించి తెలుసుకోవడం తప్పనిసరి. అయితే వచ్చే మే 2024(May 2024) నుంచి మారనున్న కొత్త నిబంధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Alert: మే 2024లో మారనున్న బ్యాంక్ రూల్స్.. తెలుసా మీకు?
Bank rules to change in May 2024 Do you know

ప్రతి కొత్త నెల ప్రారంభమైనప్పుడల్లా మొదటి రోజు నుంచి అనేక ఆర్థిక నియమాలు(New Bank Rules 2024) మారుతుంటాయి. ఈ నిబంధనలు సామాన్య ప్రజలపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ఇలాంటి నేపథ్యంలో రోజువారీ జీవనంలో భాగంగా వీటి గురించి తెలుసుకోవడం తప్పనిసరి. అయితే వచ్చే మే 2024(May 2024) నుంచి మారనున్న కొత్త నిబంధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


యెస్ బ్యాంక్‌

ప్రైవేట్ రంగ యెస్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వివిధ రకాల పొదుపు ఖాతాల కనీస సగటు బ్యాలెన్స్‌లో మార్పులు చేయబడ్డాయి. ఇప్పుడు యెస్ బ్యాంక్ ప్రో మాక్స్ సేవింగ్స్ ఖాతాల కనీస సగటు బ్యాలెన్స్ రూ.50,000కి మార్చబడింది. లేదంటే గరిష్ట ఛార్జీ రూ.1000గా విధించనున్నారు. అయితే “ప్రో ప్లస్”, “యెస్ రెస్పెక్ట్ SA” “Yes Essence SA” ఖాతాల కనీస సగటు బ్యాలెన్స్ పరిమితి రూ. 25,000 కాగా, గరిష్ట ఛార్జీ రూ. 750గా పేర్కొన్నారు. “ఖాతా ప్రో”లో కనీస నిల్వ రూ. 10,000 ఉండాలని పేర్కొనగా, దానిలో గరిష్ట ఛార్జీ రూ. 750గా ప్రకటించారు.


ICICI బ్యాంక్

ఐసీఐసీఐ బ్యాంక్ కూడా సేవింగ్స్ ఖాతాపై ఛార్జీలలో మార్పులు చేసింది. మే 1 నుంచి కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. ఇప్పుడు డెబిట్ కార్డుపై వార్షిక రుసుమును రూ.200కి తగ్గించినట్లు బ్యాంక్ తెలిపింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఛార్జీ రూ.99 ఉంటుంది. ఇది కాకుండా మే 1 నుంచి 25 పేజీలు కలిగిన చెక్ బుక్‌లపై ఎలాంటి ఛార్జీలు ఉండవని తెలిపింది. దీని తర్వాత కస్టమర్ ప్రతి పేజీ కోసం రూ.4 చెల్లించాలి. మరోవైపు వినియోగదారులు IMPS ద్వారా లావాదేవీలు చేస్తే దానిపై ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది. ఒక్కో లావాదేవీకి రూ.2.50 నుంచి రూ.15 వరకు వసూలు చేస్తారు. ఈ ఛార్జ్ లావాదేవీ మొత్తంపై ఆధారపడి ఉంటుంది.


HDFC బ్యాంక్ FD పథకం

HDFC బ్యాంక్ సీనియర్ సిటిజన్ కేర్ FDని ప్రారంభించింది. ఈ FDలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ 10 మే 2024. ఈ FDపై పెట్టుబడిదారుడికి 0.75 శాతం అదనపు వడ్డీ లభిస్తుంది. ఈ FD సాధారణ FDకి భిన్నంగా ఉంటుంది. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు FDలపై 7.75 శాతం వడ్డీ ఇవ్వబడుతుంది. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లు రూ. 5 కోట్ల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.

చమురు, LPG సిలిండర్ ధరలు

మరోవైపు ప్రతి నెల మొదటి తేదీన, చమురు మార్కెటింగ్ కంపెనీలు LPG సిలిండర్ ధరలను సవరిస్తాయి. 14 కిలోలు, 19 కిలోల సిలిండర్ల ధరలను కంపెనీలు నిర్ణయిస్తాయి. దీంతో పాటు కంపెనీలు PNG, CNG ధరలను కూడా అప్‌డేట్ చేస్తాయి.


ఇది కూడా చదవండి:

Bank Holidays: మేలో బ్యాంకులకు ఇన్ని రోజులు సెలవులా.. ఈ తేదీల్లో బ్యాంకులు బంద్

Shyam Pitroda: సంపన్నులు చనిపోతే వారి సంపద తీసుకునే చట్టం రూపొందించాలి


Read Latest Business News and Telugu News

Updated Date - Apr 27 , 2024 | 11:52 AM