Share News

Hyderabad: కుస్తీ పోటీల్లో ఓడించాడని.. మద్యం మైకంలో..

ABN , Publish Date - Apr 17 , 2024 | 11:21 AM

తాగిన మైకంలో స్నేహితుల మధ్య తలెత్తిన చిన్నవివాదం హత్యకు దారి తీసింది. అప్పటి వరకు తమతో కలిసి మద్యం తాగిన స్నేహితుడినే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి బహదూర్‌పురా పోలీస్‏స్టేషన్‌(Bahadurpura Police Station) పరిధిలో జరిగింది.

Hyderabad: కుస్తీ పోటీల్లో ఓడించాడని.. మద్యం మైకంలో..

- తండ్రి, సోదరుడి ముందే కత్తితో పొడిచి హత్య

హైదరాబాద్: తాగిన మైకంలో స్నేహితుల మధ్య తలెత్తిన చిన్నవివాదం హత్యకు దారి తీసింది. అప్పటి వరకు తమతో కలిసి మద్యం తాగిన స్నేహితుడినే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి బహదూర్‌పురా పోలీస్‏స్టేషన్‌(Bahadurpura Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్‌బాగ్‌ అసద్‌బాబానగర్‌కు చెందిన మహ్మద్‌ మహమూద్‌ కుమారుడు మహ్మద్‌ ఖలీల్‌(21) డ్రైవర్‌. అదే ప్రాంతానికి చెందిన ఖలీల్‌తోపాటు అజ్జూ, లడ్డూ, ముజమ్మిల్‌, షోయబ్‌, ఫారూఖ్‌ స్నేహితులు. వీరంతా సోమవారం అర్ధరాత్రి అసద్‌బాబానగర్‌ నాలా వద్ద కూర్చుని మద్యం తాగారు. అనంతరం కుస్తీ మాదిరి పోటీలు పెట్టి కొట్లాడుకున్నారు. ఖలీల్‌ మిగతా వారితో కుస్తీ పడి వారిని ఓడించాడు. దీంతో అందరూ ఒక్కటై ఖలీల్‌ను విచక్షణా రహితంగా కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఖలీల్‌ తండ్రి మహమూద్‌, సోదరుడు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ఊపిరాడని ప్రయాణం.. మండే ఎండల్లో కిటకిటలాడుతున్న మెట్రో రైళ్లు

ఈలోపు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు కూడా అక్కడికి రావడంతో వారిని చూసి అందరూ పారిపోయారు. దీంతో ఖలీల్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లు.. మిగతా వారిని పట్టుకొని స్టేషన్‌కు తీసుకువస్తామని కానిస్టేబుళ్లు చెప్పి గాలింపు చర్యలు చేపట్టారు. మహమూద్‌ తన కొడుకును స్కూటర్‌పై కూర్చోబెట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా పారిపోయిన యువకులంతా వచ్చి స్కూటర్‌పై నుంచి ఖలీల్‌ను లాగి కిందపడేశారు. అజ్జూ తన దగ్గర ఉన్న కత్తితో విచక్షణా రహితంగా అతన్ని పొడిచాడు. కన్న తండ్రి, సోదరుడు అడ్డుకోవడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. తీవ్ర గాయాలపాలైన ఖలీల్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారమందుకున్న డీసీపీ సాయిచైతన్య(DCP Sai Chaitanya) సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బహదూర్‌పురా ఇన్‌స్పెక్టర్‌ రఘునాథ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ఎంఎంటీఎస్ - ఆర్టీసీ కంబైన్డ్‌ పాస్‌ రూ.1,350

Updated Date - Apr 17 , 2024 | 11:25 AM