Share News

Civils: సివిల్స్ లో సత్తా చాటిన ఓరుగల్లు ముద్దుబిడ్డ

ABN , Publish Date - Apr 19 , 2024 | 07:46 PM

ఉమ్మడి వరంగల్ ముద్దుబిడ్డ మెరుగు కౌషిక్ సివిల్స్ లో సత్తా చాటాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా 82వ ర్యాంక్ సాధించాడు. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ కొట్టాడు.

Civils: సివిల్స్ లో సత్తా చాటిన ఓరుగల్లు ముద్దుబిడ్డ
United Warangal Person Got 82nd Rank In Civils

ఉమ్మడి వరంగల్ ముద్దుబిడ్డ మెరుగు కౌషిక్ సివిల్స్ లో సత్తా చాటాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా 82వ ర్యాంక్ సాధించాడు. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ కొట్టాడు. ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నల గురించి ఆంధ్రజ్యోతి దిక్సూతి ప్రతినిధికి వివరించారు.


‘ఇంట్వర్యూల్లో కొన్ని సందర్భాల్లో విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతుంటాయి. సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలో నాకు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. సాధారణంగా మనం ఎవరినైనా పకలరించాలన్నా, గౌరవించాలన్నా పెద్దవారైతే నమస్కారం, ఓకే వయస్సు వారు, లేదంటే చిన్న వారైతే హలో చెబుతాం. ఇంటర్వ్యూ రూమ్ లోపలికి వెళుతూనే అందరికీ నమస్కారం పెట్టాను. అసలు నమస్కారం ఎందుకు పెడతారని ప్రశ్నించారు. నమస్కారానికి ఉన్న ప్రాధాన్యం, దాంతో కలిగే ప్రయోజనాలు, ఏర్పడే బంధాలు గురించి అడిగి తెలుసుకున్నారు అని’ కౌషిక్ వివరించారు.


‘వ్యక్తుల ప్రవర్తన, హఠాత్తుగా ఏదైనా ప్రశ్న ఎదురైతే ఎలా స్పందిస్తారు. తను చేసే పనుల పట్ల ఎంత అవగాహన ఉంది. తదితరాలు ఇలాంటి వాటి వల్ల తెలుస్తాయని నేను అనుకుంటున్నా. సివిల్స్ లో దినేష్ దాసా బోర్డు నన్ను ఇంటర్వ్యూ చేసింది. నా ఆప్షనల్ సబ్జెక్టు సోషియాలజీ. నా సబ్జెక్టు మొదలుకుని పలు రంగదాలపై నన్ను బోర్డు ప్రశ్నించింది. వాటికి సంతృప్తికరంగా జవాబు ఇచ్చా అని’ కౌషిక్ తెలిపారు.


‘గ్రాడ్యుయేషన్ తర్వాత ఐటి కంపెనీ క్యాప్ జెమినిలో ఉద్యోగం చేశాను. అక్కడ నా జాబ్ నేచర్, నేను అందించిన సేవలు, నిర్వర్తించిన పనుల గురించి అడిగారు. ఐఐఎఫ్ టీ విద్యార్థిని కావడంతో వాణిజ్య యుద్దాలపై ప్రశ్నించారు. సోషియాలజీలో ఆత్మహత్యలపై ఒక థియరీ ఉంది. నా ఆప్షనల్ అదే కావడంతో ఆ థియరీని ప్రస్తావిస్తూ మహారాష్ట్రలో రైతుల, అలాగే కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై నా అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. రెంటినీ కంపేర్ చేస్తూ చెప్పమన్నారు. ఒకవేళ కోటా కలెక్టర్ గా వెళితే, అక్కడ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారని అడిగారు. అలా పుస్తకంలో ఉన్న థియరీని, ప్రాక్టికల్ సమస్యలకు ఎలా అప్లయ్ చేయగలనో తెలుసుకునే ప్రయత్నం చేశారు. నా హాబీ ట్రావెల్ అని చెప్పడంతో ఏయే ప్రదేశాలను సందర్శించావు. భారతదేశంలో పర్యాటక అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలేమిటి అని అడిగారు. ప్రతీ సమస్యను, మన బయోడేటా ఆధారంగా ఎలా పరిష్కరించగలనో తెలుసుకునే ప్రయత్నం చేశారు అనిపించింది. నా బయోడేటా చుట్టూ ప్రశ్నలు వేశారు అని’ కౌషిన్ వెల్లడించారు.


కోచింగ్ తీసుకోలేదు

‘సివిల్స్ కోసం ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు. సొంత ప్రిపరేషన్ పైనే ఆధార పడ్డాను. ప్రిలిమ్స్ లో జనరల్ స్టడీస్ కోసం చదువుతున్నప్పుడు సోషియాలజీపై ఆసక్తి పెరిగింది. జనరల్ స్టడీస్ లో ఎక్కువగా సమాజంపై వివిధ అంశాలు చూపే ప్రభావం ఎక్కువ ఉంటుంది. అదే నన్ను సోషియాలజీని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకునేలా చేసింది. పరీక్షల్లో కూడా 2013 నుంచి జనరల్ స్టడీస్ పేపర్లన్నీ చూశాను. అలా మెయిన్స్ లో అడిగే ప్రశ్నల తీరును సునిశితంతగా పరిశీలించగలిగాను. ప్రిలిమ్స్ క్లియర్ అయ్యాక మెయిన్స్ కి సంబంధించి గంటకు ఆరు ప్రశ్నలకు సమాధానాలు రాసేవాడిని. ఇది నా రెగ్యులర్ ప్రాక్టీస్. గూగుల్ లో టాపర్ల సమాధానాలు, ఇంట్వర్యూలు లభిస్తాయి. వాటితో నా సమాధానాలను సరిపోల్చుకునేవాడిని. లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకొని ముందుకు వెళ్లాను. అలా నా మెయిన్స్ ప్రిపరేషన్ కొనసాగింది. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ లో 82వ ర్యాంకు సాధించగలిగాను. నేను చూసిన కొందరు ఐపీఎస్ అధికారుల పనితీరు నన్ను సివిల్స్ వైపు మొగ్గుచూపేలా చేసింది. ఢిల్లీలో చదువుతున్నప్పుడు, అది మరింత బలపడింది. అదే నన్ను సివిల్స్ రాసేలా చేసింది. ఢిల్లీలో చదువుతున్నప్పుడు, అది మరింత బలపడింది. అదే నన్ను సివిల్స్ రాసేలా చేసింది. సివిల్స్ కు ప్రిపేరయ్యే అభ్యర్థులు కనీసం పది, 15 మంది టాపర్ల ఇంటర్వ్యూలను యూట్యూబ్ లో చూడాలి. ఆ టాపర్లు తమ ప్రిపరేషన్ ఎలా జరిగిందనేది చెబుతుంటారు. వాటిలో మనకు నచ్చిన విషయాలను తీసుకుని సొంతంగా ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకోవాలి. ముఖ్యంగా పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఎగ్జామ్ సరళి తెలుస్తుంది. ప్రశ్నలు అడిగే విధానం అర్థమవుతుంది. పరీక్షపై సంపూర్ణ అవగాహన కలుగుతుంది. అదే మన ప్రశ్నకు చుక్కానిలా పనిచేస్తుంది అని’ కౌషిక్ తన ఇంటర్వ్యూ గురించి దిక్సూచి ప్రతినిధికి వివరించారు.

UPSC CSE Result: సివిల్స్‌లో సత్తా చాటిన పాలమూరు బిడ్డ

మరిన్ని విద్యా వార్తల కోసం

Updated Date - Apr 19 , 2024 | 07:46 PM