Share News

Viral: పెరుగు, యోగర్ట్ మధ్య తేడా ఏంటో తెలుసా?

ABN , Publish Date - Apr 23 , 2024 | 07:16 PM

పాలను పులియబెడితే పెరుగు, యోగర్ట్ తయారవుతాయి. ఇందుకు కోసం భిన్నరకాలైన బాక్టీరియాలను వాడటంతో పెరుగు, యోగర్ట్‌ల మధ్య మౌలికమైన తేడాలు ఉంటాయి.

Viral: పెరుగు, యోగర్ట్ మధ్య తేడా ఏంటో తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: ఇది ఎండాకాలం! ఈ కాలంలో ఆరోగ్యం (Health) కోసం ఒంటికి చలువ చేసే ఆహారాలు తినేందుకు జనాలు ప్రాధాన్యం ఇస్తారు. దీంతో, ఈ కాలంలో పెరుగు (Curd), యోగర్ట్‌ (Yogurt) వైపు మళ్లుతారు. అయితే, ఈ రెండింటిలో తేడా ఏంటని చాలా మందికి సందేహం ఉంటుంది. మరి, ఆ తేడాలేంటో ఓమారు చూద్దామా!

పెరుగు, యోగర్ట్ తయారీ విధానం దాదాపు ఒకేలా ఉంటుంది. పాలను లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాతో పులియబెడితే (ఫెర్మెంటేషన్) పెరుగు తయారవుతుంది. ఈ బాక్టీరియా అన్ని చోట్లా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా పాలకు జత చేయాల్సిన అవసరం ఉండదు. పాలల్లోని కెసీన్ అనే ప్రొటీన్‌ను లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా వినియోగించుకుని తనకు కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో, లాక్టిక్ యాసిడ్ అనే ఆమ్లాన్ని కూడా విడుదల చేస్తుంది. ఫలితంగా పాలల్లో ఆమ్ల లక్షణం పెరిగి అందులోని ప్రొటీన్లల్లో మార్పులు వచ్చి పెరుగుగా మారుతుంది.

Paracetamol: తరచూ 500 ఎంజీ పారాసిటమాల్ వాడుతున్నారా? తెలీక చేస్తున్న తప్పేంటో తెలిస్తే..


యోగర్ట్ తయారీలో కూడా దాదాపు ఇవే మార్పులు ఉంటాయి. అయితే ఇక్కడ పెరుగును నియంత్రిత విధానంలో పులియబెడతారు. ఇందుకోసం లాక్టీబాసిల్లస్ బల్గేరికస్, స్ట్రెప్టోకొక్కస్ థర్మెఫిలస్ అనే రెండు రకాల బ్యాక్టీరియాలను వినియోగిస్తారు. ఇవి కూడా లాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి చేస్తాయి కాబట్టి పాలల్లోని ప్రోటీన్లల్లో మార్పులు వచ్చి యోగర్ట్ తయారవుతుంది. భిన్నమైన బ్యాక్టీరియాను వాడటంతో యోగర్ట్ పెరుగుకంటే చిక్కగా, కాస్తంత గట్టిగా ఉంటుంది. యోగర్ట్‌లోని బ్యాక్టీరియా పాలల్లోని లాక్టోస్‌‌ అనే చక్కెరను మరింత సమర్థవంతంగా వాడుకుటుంది. కాబట్టి, లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నవారికి యోగర్ట్ మంచిది (Difference Curd and Yogurt).

పెరుగు, యోగర్ట్ రెండింట్లో ప్రొటీన్లు, కాల్షియం, ప్రోబయోటిక్స్ (జీర్ణవ్యవస్థకు మేలు చేసే సూక్ష్మక్రిములు) పుష్కలంగా ఉంటాయి. యోగర్టులో విటమిన్లు, మినరల్స్‌ వంటివన్నీ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, ఇది రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తుందని నమ్ముతారు. పెరుగులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఏ,డీ,బీ విటమిన్లు, పొటాషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి, ఆహారం సులువుగా జీర్ణం అయ్యేనందుకు అవసరం.

Read Latest Health News and Telugu News

Updated Date - Apr 23 , 2024 | 07:22 PM