Share News

Tea: టీ తో స్నాక్స్ తినే అలవాటుందా? ఈ ఆహారాలను మాత్రం అస్సలు తినకండి..!

ABN , Publish Date - Apr 17 , 2024 | 01:49 PM

టీ భారతీయులకు ఒక ఎమోషన్. భారతదేశంలో మంచినీళ్ల తరువాత ఎక్కువగా తాగుతున్నది టీ నే అనే మాట చాలా షాకింగ్ గా అనిపిస్తుంది. చాలామంది టీని ఉత్తినే తాగరు. టీ తో పాటూ స్నాక్స్ కూడా లాగిస్తారు. అయితే వీటిని మాత్రం తినడం మంచిది కాదు.

Tea: టీ తో స్నాక్స్ తినే అలవాటుందా? ఈ ఆహారాలను మాత్రం అస్సలు తినకండి..!

టీ భారతీయులకు ఒక ఎమోషన్. భారతదేశంలో మంచినీళ్ల తరువాత ఎక్కువగా తాగుతున్నది టీ నే అనే మాట చాలా షాకింగ్ గా అనిపిస్తుంది. కానీ ఇది నిజమే.. మరొక విషయం ఏమిటంటే.. చాలామంది టీని ఉత్తినే తాగరు. టీ తో పాటూ స్నాక్స్ కూడా లాగిస్తారు. వీటిలో పకొడాలు, సమోసా, మిక్చర్, బిస్కెట్ వంటివి బోలెడు ఉంటాయి. అయితే టీ తో పాటూ కొన్ని స్నాక్స్ తింటే రుచి గురించి దేవుడెరుగు ఆరోగ్యానికి మాత్రం దారుణంగా దెబ్బతింటుందని అంటున్నారు ఆహార నిపుణులు. టీ తో పాటు అస్సలు తీనకూడని స్నాక్స్ ఏంటో తెలుసుకుంటే..

స్పైసీ ఫుడ్స్ టీతో పాటు తినకూడదు. దీని కారణంగా టీ రుచి మందకొడిగా మారుతుంది. అదే సమయంలో టీతో పాటు ఆమ్లత్వం ఉన్న ఆహారాన్ని తీసుకుంటే శరీరం శోషించబడిన కాటెచిన్స్ మొత్తాన్ని తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: ఆడవాళ్లు పొరపాటున కూడా తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!


పాలు లేదా క్రీమ్ టీలోని పాలీఫెనాల్స్‌ను తటస్థీకరిస్తుంది. తద్వారా టీలో ఉండే యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలను తగ్గిస్తుంది. టీతో ఎప్పుడూ తినకూడని వస్తువు ఏదైనా ఉందంటే అది ఫ్రూట్ సలాడ్. పండ్లు, టీ కలయిక అసిడిటీని కలిగిస్తుంది. ఎండిన పండ్లను టీతో పాటు చిరుతిండిగా తినవచ్చు. అయితే తాజా పండ్లను టీతో కలిపి తినడం హానికరం.

ఆకుపచ్చ కూరగాయలలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. టీలో టానిన్లు, ఆక్సలేట్‌లు ఉంటాయి. ఇవి శరీరం ఐరన్ గ్రహించడంలో అంతరాయం కలిగిస్తాయి. అందుకే టీతో పాటు ఆకుపచ్చ కూరగాయలను కూడా తినకూడదు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఆడవాళ్లు పొరపాటున కూడా తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!

బీపీ పెషెంట్లు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడితే.. సేఫ్ గా ఉండొచ్చట!

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 17 , 2024 | 01:49 PM