Share News

Vitamin-E Capsule: విటమిన్-ఇ క్యాప్సూల్ ముఖానికి ఎంతసేపు అప్లై చేయవచ్చు? మంచి బెనిఫిట్స్ ఉండాలంటే ఏం చేయాలంటే !

ABN , Publish Date - Apr 15 , 2024 | 04:29 PM

విటమిన్-ఇ క్యాప్సూల్ ను చాలామంది చర్మ సంరక్షణలో ఉపయోగిస్తారు. కానీ దీన్ని సరిగ్గా ఎలా ఉపయోగించాలో చాలా తక్కువమందికి తెలుసు.

Vitamin-E Capsule: విటమిన్-ఇ క్యాప్సూల్ ముఖానికి ఎంతసేపు అప్లై చేయవచ్చు? మంచి బెనిఫిట్స్ ఉండాలంటే ఏం చేయాలంటే  !

విటమిన్ ఇ అనేది కొవ్వులో కరిగే యాంటీ ఆక్సిడెంట్. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కొందరు దీనిని సాదాగా ముఖం మీద అప్లై చేస్తారు, మరికొందరు ఫేస్ ప్యాక్‌లలో మిక్స్ చేస్తారు లేదా కలబంద జెల్ లో కలుపుతారు. కానీ దీన్ని సరిగ్గా ఎలా ఉపయోగించాలో చాలా తక్కువమందికి తెలుసు. విటమిన్ ఇ క్యాప్సూల్‌ను ముఖంపై సరిగ్గా అప్లై చేయకపోతే దాని ప్రభావం వేరుగా ఉంటుంది. కొన్నిసార్లు అది పనిచేయదు కూడా. విటమిన్-ఇ క్యాప్సూల్ ఎంతసైపు రాసుకోవాలి? మంచి బెనిఫిట్స్ కోసం ఎలా రాసుకోవాలి? తెలుసుకుంటే..

విటమిన్ ఇ క్యాప్సూల్స్‌లో శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. ఈ యాంటీ-ఆక్సిడెంట్ల కారణంగా చిన్న వయసులోనే వచ్చిన ముడుతలను విటమిన్-ఇ తొలగిస్తుంది. దెబ్బతిన్న చర్మాన్ని రిపేర్ చేస్తుంది.

ఇది కూడా చదవండి: రోజూ బొడ్డులో కొన్ని చుక్కల నూనె వేస్తే శరీరంలో కలిగే మార్పులేంటో తెలుసా?


ఈ క్యాప్సూల్ చర్మానికి తేమను అందిస్తుంది. విటమిన్ ఇ క్యాప్సూల్స్ ముఖ్యంగా డీహైడ్రేట్ చేయబడిన లేదా పొడి చర్మంపై అప్లై చేయవచ్చు. ఇది చర్మానికి శోథ నిరోధక లక్షణాలను కూడా అందిస్తుంది, చర్మానికి ఓదార్పు ప్రభావాలను ఇస్తుంది.

విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను ఉపయోగించే ముందు లేదా విటమిన్ ఇ ఆయిల్‌ను ముఖంపై అప్లై చేయడానికి ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.

అధిక నాణ్యత కలిగిన విటమిన్ ఇ క్యాప్సూల్స్ మాత్రమే కొనండి. కెమిస్ట్ షాపుల్లో లభించే క్యాప్సూల్స్ నాణ్యత బాగానే ఉంటుంది. ప్యాకెట్ పాడైపోయిన లేదా లీకేజీ కనిపించే క్యాప్సూల్స్‌ను కొనుగోలు చేయవద్దు.

ముఖం శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను అప్లై చేయాలి. ముఖంపై మురికి లేదా నూనె పొర ఉంటే క్యాప్సూల్ ప్రభావం చూపించదు.

చాలా సార్లు ప్యాచ్ టెస్ట్ చేయకుండానే చాలామంది ముఖంపై విటమిన్ ఇ ని అప్లై చేస్తారు. ఈ తప్పును ఎప్పుడూ చేయకూడదు. ఈ క్యాప్సూల్‌ అలెర్జీ ఉందో లేదో తెలుసుకోవడానికి ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయాలి. తర్వాత మాత్రమే దాన్ని ఉపయోగించాలి.

శుభ్రమైన సూదిని ఉపయోగించి విటమిన్ ఇ క్యాప్సూల్‌ కు రంధ్రం చేసి అరచేతిలో వేసుకోవాలి. తరువాత వేళ్లతో కొద్ది కొద్దిగా తీసుకుంటూ ముఖమంతా సున్నితంగా రాసుకోవాలి.

ఈ క్యాప్సూల్‌ను ముఖంపై చాలా సున్నితంగా రుద్ది మసాజ్ చేసుకోవాలి. కళ్ల దగ్గర ఉన్న సున్నితమైన చర్మాన్ని ఎక్కువగా రుద్దకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను ముఖంపై అప్లై చేయడానికి పరిమిత సమయం లేదు. దీన్ని 30 నిమిషాల నుండి ఒక గంట పాటు ఉంచవచ్చు. లేదా రాత్రంతా ఉంచవచ్చు. మరుసటి రోజు ముఖం కడుక్కోవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం..ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 15 , 2024 | 04:29 PM