Share News

Women's Health: ప్రతి మహిళ తప్పక తెలుసుకోవలసిన విషయమిది..గర్భాశయానికి సంబంధించి ఈ 4 సమస్యలు తెలుసా..!

ABN , Publish Date - Apr 23 , 2024 | 03:39 PM

.మహిళలలో చాలా సాధారణంగా ఎదురయ్యే 4 రకాల సమస్యలు ఉన్నాయి. ఇవి చాలా సాధారణమైనవే అయినా వీటిని గుర్తించడంలో మహిళలు గందరగోళానిరి గురవుతారు. ఈ సమస్యలేంటో వీటి లక్షణాలేంటో తెలుసుకుంటే వీటిని గుర్తించడం సులువు అవుతుంది.

Women's Health: ప్రతి మహిళ తప్పక  తెలుసుకోవలసిన విషయమిది..గర్భాశయానికి సంబంధించి ఈ 4 సమస్యలు తెలుసా..!

గర్భాశయం స్త్రీ శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ఇది మహిళల జీవితకాలంలో అనేక చాలా మార్పులకు లోనవుతుంది. వేగంగా మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, వయస్సుతో పాటు అనేక గర్భాశయ సంబంధిత సమస్యలు స్త్రీలను ఇబ్బంది పెడుతుంటాయి. మహిళలలో చాలా సాధారణంగా ఎదురయ్యే 4 రకాల సమస్యలు ఉన్నాయి. ఇవి చాలా సాధారణమైనవే అయినా వీటిని గుర్తించడంలో మహిళలు గందరగోళానిరి గురవుతారు. ఈ సమస్యలేంటో వీటి లక్షణాలేంటో తెలుసుకుంటే వీటిని గుర్తించడం సులువు అవుతుంది.

గర్భాశయ ఫైబ్రాయిడ్లు..

ఇది మహిళలు గర్భం దాల్చే వయస్సులో ఎదురయ్యే సమస్య. ఇందులో గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు పెరుగుతాయి. ఇవి క్యాన్సర్ కణితుల లాంటివి. కానీ క్యాన్సర్ కావు. ఇది మహిళలలో సాధారణ సమస్య. దీని కారణంగా స్త్రీలు ఎటువంటి ప్రత్యేక సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. దీనిని మైయోమా లేదా ఫైబ్రోమా అని కూడా అంటారు. ఇవి గర్భాశయానికి ఒకటి లేదా రెండు వైపులా రావచ్చు. ఇవి కణితులు కండరాలు, పీచు కణజాలంతో ఏర్పడి ఉంటాయి. ఇవి పెద్ద పరిమాణంలో ఉంటే కడుపు నొప్పి లేదా నెలసరిలో రక్తస్రావం ఎక్కువ రోజులు కొనసాగడం వంటి సమస్యలు ఏర్పడతాయి.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగితే.. జరిగేదిదే..!


గర్భాశయ రక్తస్రావం..

గర్భాశయంలో జరిగే ఏదైనా అసాధారణ రక్తస్రావాన్ని గర్భాశయ రక్తస్రావం అంటారు. పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం జరిగినా.. రెండు పీరియడ్స్ మధ్య రక్తస్రావం ఎక్కువగా ఉన్నా, సంభోగం తర్వాత రక్తస్రావం ఎక్కువ కాలం కొనసాగినా అది గర్భాశయ రక్తస్రావం. ఇది ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యత, పీసీఓఎస్, థైరాయిడ్ తదితర సమస్యలు గర్భాశయ రక్తస్రావం కలిగిస్తాయి. పరీక్షల ద్వారా వీటికి కారణాన్ని కనుగొన్న తరువాత చికిత్స ఉంటుంది.

ఎండోమెట్రియోసిస్..

గర్భాశయం చుట్టూ ఉండే రేఖను ఎండోమెట్రియం అంటారు. అండాశయం పైన లేదా క్రింద ఫెలోపియన్ ట్యూబ్ లేదా మూత్రాశయం పైన, శరీరంలోని ఇతర ప్రదేశాలలో ఎండోమెట్రియం ఏర్పడటం ప్రారంభించినప్పుడు దానిని ఎండోమెట్రియోసిస్ అంటారు. పెల్విక్ నొప్పి, లైంగిక సంపర్కం సమయంలో, తర్వాత నొప్పి. నెలసరి వస్తే ఎక్కువరోజులు రక్తస్రావం జరగడం, పొత్తి కడుపు నొప్పి, అలసట, మచ్చలు వంటి సమస్యలు సంభవించవచ్చు. దీని చికిత్స మందులు, హార్మోన్ థెరపీ, తీవ్రత ఎక్కువ ఉంటే శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు.

Health Tips: మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లను తినాలా వద్దా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..!



గర్భాశయ ప్రోలాప్స్..

గర్భాశయం చుట్టూ ఉన్న కండరాలను పెల్విక్ ఫ్లోర్ కండరాలు అని పిలుస్తారు. ఇవి బలహీనంగా లేదా దెబ్బతినడం వల్ల గర్భాశయం యోని పైన వేలాడుతున్నట్టు ఉంటుంది. ఇది నాలుగు దశలను కలిగి ఉంటుంది. గర్భం, ఊబకాయం, మలబద్ధకం లేదా నార్మల్ డెలివరీ దీనికి కారణాలు కావచ్చు. ఇది శస్త్రచికిత్స, నాన్-సర్జికల్ పద్ధతుల ద్వారా నయమవుతుంది. వ్యాయామం, ఆహారం, మంచి జీవనశైలి ఫాలో కావడం వల్ల కూడా

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగితే.. జరిగేదిదే..!

మీకు నిద్రలో నరాలు లాగేస్తుంటాయా? అయితే ఈ సమస్యలున్నట్టే లెక్క ..!

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 23 , 2024 | 03:39 PM