Share News

Delhi Congress: ఢిల్లీ కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్‌గా దేవేంద్ర యాదవ్

ABN , Publish Date - Apr 30 , 2024 | 02:35 PM

కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ విభాగం తాత్కాలిక అధ్యక్షుడుగా దేవేంద్ర యాదవ్‌‌ను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్టు ఏఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. పంజాబ్ ఏఐసీసీ ఇన్‌చార్జి కూడా ఆయన కొనసాగుతారని పేర్కొంది.

Delhi Congress: ఢిల్లీ కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్‌గా దేవేంద్ర యాదవ్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ విభాగం తాత్కాలిక అధ్యక్షుడుగా దేవేంద్ర యాదవ్‌ (Devendra Yadav)ను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్టు ఏఐసీసీ (AICC) ఒక ప్రకటనలో తెలిపింది. పంజాబ్ ఏఐసీసీ ఇన్‌చార్జి కూడా ఆయన కొనసాగుతారని పేర్కొంది. డీపీసీసీఐ చీఫ్ పదవికి అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేయడంతో తాజా నియామకం జరిగింది.


కీలకమైన ఢిల్లీ యూనిట్ చీఫ్ పదవికి దేవేందర్ యాదవ్ పేరుతో పాటు రాజేష్ లిలోతియా, అభిషేక్ దత్ పేర్లు కూడా పరిశీలనకు వచ్చినట్టు డీపీసీసీ వర్గాలు సోమవారం ఉదయం తెలిపాయి. కాగా, డీపీసీసీ చీఫ్ పదవికి అరవీందర్ సింగ్ లవ్లీ శనివారంనాడు రాజీనామా చేయడం పార్టీలో ఒకింత కలకలం రేపింది. ఢిల్లీ యూనిట్ వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో 'ఆప్'తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం తనకు అసంతృప్తి కలిగించినట్టు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపిన రాజీనామా లేఖలో లవ్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, తాను పార్టీలోనే కొనసాగుతానని లవ్లీ ప్రకటించారు.

Read latest National News And Telugu News

Updated Date - Apr 30 , 2024 | 02:35 PM