Share News

Lok Sabha Elections: కేంద్ర ఏజెన్సీల ద్వారా ఫోన్ల ట్యాపింగ్.. ఈసీకి డీఎంకే ఫిర్యాదు

ABN , Publish Date - Apr 17 , 2024 | 03:10 PM

లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ఏజెన్సీలు తమ అభ్యర్థులు, కీలక నేతలు, మిత్రులు, సన్నిహత బంధువుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్టు డీఎంకే సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి తమిళనాడు డీఎంకే నేత ఆర్ఎస్ భారతి ఒక లేఖలో ఫిర్యాదు చేశారు.

Lok Sabha Elections: కేంద్ర ఏజెన్సీల ద్వారా ఫోన్ల ట్యాపింగ్.. ఈసీకి డీఎంకే ఫిర్యాదు

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ కేంద్ర ఏజెన్సీలు తమ అభ్యర్థులు, కీలక నేతలు, మిత్రులు, సన్నిహత బంధువుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్టు డీఎంకే (DMK) సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి (EC) తమిళనాడు డీఎంకే నేత ఆర్ఎస్ భారతి (RS Bharathi) ఒక లేఖలో ఫిర్యాదు చేశారు.

Lok Sabha polls 2024: ఎన్డీయేకు 150 సీట్లు దాటవు.. సంయుక్త సమావేశంలో రాహుల్, అఖిలేష్


''కేంద్రం అధీనంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ, ఐటీ (ఇన్‌కమ్ టాక్స్), ఇతర ఏజెన్సీలు అక్రమంగా తమ అభ్యర్థులు, కీలక నేతలు, మిత్రులు, సన్నిహితుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై ఈ ఏజెన్సీలు పెగాసస్ వంటి అధునాతన నిఘా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది'' అని ఆ లేఖలో భారతి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్య అప్రజాస్వామికమని, స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరిగేందుకు ఎన్నికల కమిషన్ తక్షణం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. కాగా, అక్రమంగా తమ పార్టీ నేతల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని తమిళనాడు విపక్ష పార్టీ అన్నాడీఎంకే ఆరోపిస్తోంది.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 17 , 2024 | 03:12 PM