Share News

Elections 2024: ఎన్నికల ప్రక్రియలో ఒక ఓటరుపై ఎంత ఖర్చవుతుందో తెలుసా..

ABN , Publish Date - Apr 17 , 2024 | 03:35 PM

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు ( Lok Sabha Elections 2024 ) కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఏడు విడతల్లో జరగనున్న ఎలక్షన్లకు అధికారులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

Elections 2024: ఎన్నికల ప్రక్రియలో ఒక ఓటరుపై ఎంత ఖర్చవుతుందో తెలుసా..

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు ( Lok Sabha Elections 2024 ) కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఏడు విడతల్లో జరగనున్న ఎలక్షన్లకు అధికారులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ సారి దేశంలో18వ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓట్లు రాబట్టుకునేందుకు పలు రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంటాయి. ఇందుకోసం అభ్యర్థితో పాటు పార్టీ కూడా భారీగానే ఖర్చు చేస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల వ్యయం చిన్న రాష్ట్రాల బడ్జెట్‌తో సమానంగా ఉంటుంది. 1952 నుంచి 2019 లోక్‌సభ ఎన్నికల వ్యయం దాదాపు 900 రెట్లు పెరిగింది. ఇప్పటివరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రూ.17 వేల 930 కోట్లకు పైగా ఖర్చు చేశారు. 2024లో మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా.


Ayodhya: అయోధ్య రాముడికి అపూర్వ ఘట్టం.. ఆ వేడుకనూ మీరూ చూసేయండి..

2014లో 16వ లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. దేశంలో తొలిసారిగా 9 దశల్లో ఓటింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 282 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వచ్చి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. ఈ ఎన్నికల్లో ఖర్చుల సంఖ్య వేగంగా పెరిగింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో రూ.3870.3 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఎన్నికల్లో అత్యధిక వ్యయంతో పాటు ఓటింగ్ శాతం కూడా అత్యధికంగా 64 శాతం నమోదైంది.


Weather News: వెదర్ అలర్ట్.. ఆ రాష్ట్రాలకు వర్షాలు.. ఈ రాష్ట్రాలకు ఎండలు..!!

భారతీయ జనతా పార్టీ 2019లో నరేంద్ర మోడీ నాయకత్వంలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి 303 సీట్లు గెలుచుకుంది. ఈసారి నరేంద్ర మోదీ ప్రధానిగా ఎన్నికైనప్పటికీ ఎన్నికల వ్యయం భారీగా పెరిగింది. ఈ ఎన్నికల్లో రూ.9000 కోట్లు ఖర్చు చేశారు. ఇది గత ఎన్నికల కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఈ ఎన్నికల్లో 90 కోట్ల మంది ఓటర్లు ఉండగా, అందులో 67.4 శాతం మంది ఓటేశారు. ఈ ఎన్నికల్లో ఒక ఓటరుపై దాదాపు రూ.100 ఖర్చు చేశారు.


2024 లో జరగబోయే ఎన్నికల వ్యయం రూ.15000 కోట్లు దాటవచ్చనే అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రచారం మొదలుకుని వివిధ కార్యక్రమాలకు భారీగానే ఖర్చు చేస్తున్నారు. ఈసారి ఎన్నికల వ్యయం రూ.15 వేల కోట్లకు పైగానే ఉంటుందని గత ఎన్నికల ఖర్చుల లెక్కలు చెబుతున్నాయి. బీజేపీ నుంచి కాంగ్రెస్ వరకు కోట్లాది రూపాయల ప్రకటనలు ఇస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్ల కోసం కూడా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుండటం గమనార్హం.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 17 , 2024 | 03:35 PM