Share News

Bangalore: రాహుల్‌కు కనీస పరిజ్ఞానం లేదు..

ABN , Publish Date - Apr 25 , 2024 | 03:59 AM

కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి కనీస పరిజ్ఞానం లేదని మాజీ ప్రధాని దేవెగౌడ విమర్శించారు.

Bangalore: రాహుల్‌కు కనీస పరిజ్ఞానం లేదు..

బెంగళూరు, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి కనీస పరిజ్ఞానం లేదని మాజీ ప్రధాని దేవెగౌడ విమర్శించారు. బెంగళూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేతలు ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాలేమనే గ్యారెంటీల హామీలు ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని దిగజార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయడం అసాధ్యమన్నారు. రాహుల్‌గాంధీ సంపదపై సమీక్ష జరిపి హామీలు ప్రకటించాల్సి ఉండేదన్నారు. 30 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు హామీ ఇచ్చారనీ, రాత్రికి రాత్రి అన్నింటిని ఎలా సృష్టిస్తారని, వారికి వేతనాలు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ లేకుండా ఎలా మాట్లాడతారన్నారు.


నేడు కన్నౌజ్‌ నుంచి అఖిలేష్‌యాదవ్‌ నామినేషన్‌

లఖ్‌నవూ, ఏప్రిల్‌ 24: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయనున్నారని పార్టీ నేత రామ్‌గోపాల్‌ యాదవ్‌ తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదని, గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అఖిలేష్‌ నామినేషన్‌ దాఖలు చేస్తారని ఆయన బుధవారం వెల్లడించారు.

ఈ స్థానం నుంచి అఖిలేష్‌ బంధువు తేజ్‌ ప్రతాప్‌యాదవ్‌ పోటీ చేస్తారని సోమవారం ఎస్పీ ప్రకటించింది. అయితే తేజ్‌ అభ్యర్థిత్వాన్ని పార్టీ కార్యకర్తలు వ్యతిరేకించారని, అందుకే అక్కడ అఖిలేష్‌ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.

Updated Date - Apr 25 , 2024 | 04:10 AM