Share News

Lok Sabha elections: గుళ్లను చుట్టేస్తున్న కంగనా

ABN , Publish Date - Apr 17 , 2024 | 02:36 PM

హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి కంగనా రనౌత్ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. దీంతో లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఆ పరిధిలోని గుళ్లు గోపురాలను సైతం ఆమె చుట్టేస్తున్నారు. అందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను. కంగనా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లో చేస్తున్నారు.

Lok Sabha elections: గుళ్లను చుట్టేస్తున్న కంగనా
Kangana Ranaut

సిమ్లా, ఏప్రిల్ 17: హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి (Mandi) లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్ (Kangana Ranaut) బరిలో నిలిచారు. దీంతో లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఆ పరిధిలోని గుళ్లు గోపురాలను సైతం ఆమె చుట్టేస్తున్నారు.

అందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను. కంగనా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లో చేస్తున్నారు. తాజాగా బార్మౌర్‌లో 7వ శతాబ్దంలో నిర్మించిన చౌరాసి దేవాలయాన్ని ఆమె సందర్శించారు. ఆ క్రమంలో అక్కడి స్థానికులతో ఆమె ముచ్చటించారు. అందుకు సంబంధించిన విషయాలను సైతం కంగనా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

Lok Sabha election 2024: ఎల్లుండి తొలి దశ పోలింగ్: నేటితో ప్రచారానికి తెర


ఇటీవల టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా(dalai lama) ను సైతం కంగనా కలిసిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలను సైతం ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 2024, జనవరి 22న అయోధ్యలోని రామ మందిరానికి వెళ్లి.. బాల రాముడిని ఆమె దర్శించారు. కంగనా స్వస్థలం భాంబ్లా. ఇది మండి లోక్‌సభ పరిధిలో ఉంది.

ఈ సారి మండి లోక్‌సభ టికెట్‌ కంగనాకు బీజేపీ అగ్రనాయకత్వం కేటాయించింది. రాష్ట్రంలో మొత్తం 4 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వాటిలో మరోసారి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం.. ఆ పార్టీ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 4 లోక్‌సభ స్థానాలు.. బీజేపీ ఖాతాలో పడ్డాయి.

Lok Sabha polls 2024: ఎన్డీయేకు 150 సీట్లు దాటవు.. సంయుక్త సమావేశంలో రాహుల్, అఖిలేష్


ఈ ఎన్నికల్లో సైతం ఆ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపు కోసం ఆ పార్టీ కీలకంగా వ్యవహరిస్తోంది. అందులోభాగంగా ఎంపీ అభ్యర్థుల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేస్తుంది. ఆ క్రమంలో కంగనాను ఎంపీ అభ్యర్థిగా బరిలో దించింది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిగా విక్రమాదిత్య సింగ్‌ను బరిలో దింపింది. ఇతడు.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ ప్రతిభా సింగ్ కుమారుడు.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 17 , 2024 | 02:40 PM