Share News

Tiger attack Video: ఈ దున్నపోతు టైం బాగుంది.. ప్రాణాలు పోతాయనగా.. చివరి క్షణంలో..

ABN , Publish Date - Apr 17 , 2024 | 05:32 PM

పులి ఒక్కసారి వేటను టార్గెట్ చేసిందంటే.. ఇక దాన్నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు. అయితే కొన్నిసార్లు పులులకూ ఛేదు ఫలితం ఎదురవుతుంటుంది. నోటిదాకా వచ్చిన జంతువులు కాస్త.. నోరూరించి చటుక్కున జారుకుంటుంటాయి. ఇలాంటి..

Tiger attack Video: ఈ దున్నపోతు టైం బాగుంది.. ప్రాణాలు పోతాయనగా.. చివరి క్షణంలో..

పులి ఒక్కసారి వేటను టార్గెట్ చేసిందంటే.. ఇక దాన్నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు. అయితే కొన్నిసార్లు పులులకూ ఛేదు ఫలితం ఎదురవుతుంటుంది. నోటిదాకా వచ్చిన జంతువులు కాస్త.. నోరూరించి చటుక్కున జారుకుంటుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దున్నపోతుపై దాడి చేసిన పులి.. దాని మెడ పట్టుకుని తినబోయింది. అయితే చివరి నిముషంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఈ దున్నపోతు టైం బాగుంది’’.. అంటూ కామెంట్లు చేస్తు్న్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (viral video) తెగ వైరల్ అవుతోంది. నీళ్లు తాగడానికి వచ్చిన దున్నపోతును ఓ పులి దూరం నుంచి గమనిస్తుంది. ఎలాగైనా దాన్ని వేటాడి తినేయాలని ప్లాన్ చేస్తుంది. అనుకున్నట్లుగానే దున్నపోతు వద్దకు నక్కి నక్కి వెళ్లి.. చివరకు ఊహించని విధంగా (tiger attack on Buffalo) అటాక్ చేస్తుంది. పులి అనూహ్య దాడితో ఉలిక్కిపడిన దున్నపోతు.. తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయినా పులి దాన్ని వదలకుండా గట్టిగా పట్టుకుంటుంది. ఈ క్రమంలో నీళ్లలో రెండింటి మధ్య చాలా సేపు పోరాటం సాగుతుంది. ఇక దున్నపోతు ప్రాణాలు పోతాయనే సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది.

Viral Video: ఈ జొమాటో డెలివరీ బాయ్‌ స్పెషాలిటీయే వేరు.. జంక్షన్‌లో అతన్ని చూసి అవాక్కైన వాహనదారులు..

తన స్నేహితుడిపై పులి దాడి చేయడాన్ని చూసిన మరో దున్నపోతు.. వేగంగా పరుగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. భారీ కాయంతో ఉన్న దున్నపోతును చూడగానే పులి ఒక్కసారిగా జడుసుకుంటుంది. ‘‘వామ్మో..! టైం బాలేదు.. పారిపోవడం బెటర్’’.. అని అనుకుంటూ అక్కడి నుంచి పారిపోతుంది. ఇలా స్నేహితుడి కారణంగా దున్నపోతు ప్రాణాలతో బయటపడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పులినే భయపెట్టిన దున్నపోతు’’.. అంటూ కొందరు, ‘‘చివర్లో దున్నపోతు ఎంట్రీ.. మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 36 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వరదలను ఇలా వాడేసుకున్నారు.. వీళ్ల బిజినెస్ మామూలుగా లేదుగా..

Updated Date - Apr 17 , 2024 | 05:47 PM