Share News

Viral Video: వామ్మో..! ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా.. ఆటోలో వెళ్తూ బైకర్‌కు షాకిచ్చిన మహిళ.. చివరకు..

ABN , Publish Date - Apr 17 , 2024 | 02:50 PM

బహిరంగ ప్రదేశాల్లో కొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. మరికొందరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. ఇళాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...

Viral Video: వామ్మో..! ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా.. ఆటోలో వెళ్తూ బైకర్‌కు షాకిచ్చిన మహిళ.. చివరకు..

బహిరంగ ప్రదేశాల్లో కొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. మరికొందరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. ఇళాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ ఆటోలో వెళ్తూ.. వెనుక వస్తున్న బైకర్‌కు షాక్ ఇచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియోలో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైడింగ్‌కు వెళ్తుండగా ఇద్దరు బైకర్లకు మార్గ మధ్యలో ఊహించని షాక్ తగులుతుంది. నిదానంగా వెళ్తున్న సమయంలో ఓ ఆటో వారిని ఓవర్‌టేక్ చేసి ముందుకు వెళ్తుంది. అయితే ఆ ఆటోలో వెనుక వైపు కూర్చున్న మహిళ.. ఉన్నట్టుండి తల బయటికి పెట్టి గుట్కాను (woman spit on the bike) బైకుపై ఉమ్మి వేసింది. బైకు వస్తుందనే విషయం తెలిసి కూడా ఆమె ఉమ్మి వేయడంపై సదరు బైక్ రైడర్లు షాక్ అయ్యారు.

Viral Video: వావ్..! పనిని ప్రేమించడం అంటే ఇదే.. ఈ పనిని ఇలా చేయడం ఎవరికీ సాధ్యం కాదేమో..

తర్వాత ఆటోను ఓవర్‌టేక్ చేసి ఆపేశారు. ఎందుకుకిలా చేశారు.. అంటూ సదరు మహిళను నిలదీశారు. అయితే దీనిపై ఆమె నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే కాకుండా బైకర్లపైనే సీరియస్ అవుతుంది. తానెందుకు సమాధానం చెబుతాను.. అంటూ వారితో వాగ్వాదానికి దిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఈమేంటీ.. ఇలా చేసిందీ’’.. అంటూ కొందరు, ‘‘ఇలా చేయడం పద్ధతి కాదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.40లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Puzzle: ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో ఉన్న 3 తేడాలను.. 30 సెకన్లలో కనిపెట్టగలరా..?

Updated Date - Apr 23 , 2024 | 04:28 PM