Share News

Viral: చైనా రైల్వే స్టేషన్ డిజైన్ చూసి షాక్‌లో నెటిజన్లు!

ABN , Publish Date - Apr 16 , 2024 | 09:56 PM

చైనాలో త్వరలో నిర్మించనున్న ఓ రైల్వే స్టేషన్ డిజైన్ శానిటరీ ప్యాడ్ ఆకారంలో ఉండటం నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది.

Viral: చైనా రైల్వే స్టేషన్ డిజైన్ చూసి షాక్‌లో నెటిజన్లు!

ఇంటర్నెట్ డెస్క్: చైనాలో (China) త్వరలో నిర్మించనున్న నాంజింగ్ రైల్వే స్టేషన్ (Nanjing Railway Station) డిజైన్ చూసి జనాలు షాకైపోతున్నారు. అత్యాధునికమైనదిగా ప్రభుత్వం చెబుతున్న స్టేషన్‌ను ఎవరైనా ఈ తీరులో రూపొందిస్తారా? అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఈ రైల్వే స్టేషన్ డిజైన్ తాలూకు ఫొటో ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది.

Viral: ఆర్టీసీ కండక్టర్ రూ.5 చిల్లర ఇవ్వలేదంటూ ఆన్‌లైన్‌లో ఫిర్యాదు.. చివరకు..

ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ కథనాల ప్రకారం, ప్లమ్ బ్లాసమ్ అనే పువ్వుల ఆకారంలో ఈ రైల్వే స్టేషన్ డిజైన్ రూపొందించారు. ఈ స్టేషన్ ప్రాథమిక డిజైన్‌ను జియాంగ్జూ ప్రావిన్స్ ప్రభుత్వం, చైనా స్టేట రైల్వే గ్రూప్ ఆమోదించాయి. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 2,763 మిలియన్ డాలర్లను ఈ స్టేషన్‌కు కేటాయించారు.


అయితే, జనాల చర్చంతా మాత్రం స్టేషన్ డిజైన్‌పైనే కేంద్రీకృతమై ఉంది. ఈ స్టేషన్‌ను శానిటరీ ప్యాడ్‌లా డిజైన్ చేశారని నెటిజన్లు చెబుతున్నారు. మనకు కనిపించింది ఇంజినీర్లకు ఎందుకు కనిపించలేదో అంటూ కొందరు విస్తుపోయారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 16 , 2024 | 10:04 PM