Share News

Viral Video: ఈ అంకుల్ నిజంగా నాగుపాములా మారిపోయాడు.. పెళ్లి సంగీత్ వేడుకలో ఇద్దరిని కాటు వేశాడు.. వీడియో చూడండి..!

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:33 AM

ప్రస్తుతం పెళ్లి, ఊరేగింపు, ఇతర ఫంక్షన్లలో డీజే, డ్యాన్స్ తప్పకుండా ఉండాల్సిందే. డీజే లేకపోతే పెళ్లి వేడుక అసంపూర్తిగా ఉన్నట్టు చాలా మంది ఫీలవుతున్నారు. అలాగే డ్యాన్స్ అనగానే చాలా మంది చేసేది నాగిన్ డ్యాన్స్. పెళ్లి ఊరేగింపులో ప్రజలు నాగిన్ డ్యాన్స్ చేయడాన్ని చాలా మంది ఇష్టపడతారు.

Viral Video: ఈ అంకుల్ నిజంగా నాగుపాములా మారిపోయాడు.. పెళ్లి సంగీత్ వేడుకలో ఇద్దరిని కాటు వేశాడు.. వీడియో చూడండి..!

ప్రస్తుతం పెళ్లి (Wedding), ఊరేగింపు, ఇతర ఫంక్షన్లలో డీజే, డ్యాన్స్ తప్పకుండా ఉండాల్సిందే. డీజే లేకపోతే పెళ్లి వేడుక అసంపూర్తిగా ఉన్నట్టు చాలా మంది ఫీలవుతున్నారు. అలాగే డ్యాన్స్ అనగానే చాలా మంది చేసేది నాగిన్ డ్యాన్స్ (Naagin Dance). పెళ్లి ఊరేగింపులో నాగిన్ డ్యాన్స్ చేయడాన్ని చాలా మంది ఇష్టపడతారు. తాజాగా జరిగిన ఓ వివాహ వేడుకలో ఓ అంకుల్ నాగిన్ డ్యాన్స్ వేశాడు. మిగిలిన వారికి చుక్కలు చూపించాడు. ఆ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


namaste_barabanki అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో బ్యాగ్రౌండ్‌లో నాగిన్ సాంగ్ ప్లే అవుతోంది. డ్యాన్స్ కోసం వేసిన వేదిక మీద ఓ అంకుల్ నాగిన్ డ్యాన్స్ వేస్తున్నాడు. డ్యాన్స్ చేస్తూ కాటు వేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ అంకుల్ వేసిన కాటు వల్ల ఓ వ్యక్తి కింద పడిపోయాడు. అయినా ఆ అంకుల్ ఆగకుండా చాలా ఉత్సాహంగా డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు. మరో వ్యక్తిని కూడా అలాగే కాటు వేసి కింద పడేశాడు.


ఆ అంకుల్ ఫన్నీ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది నాగిన్ డ్యాన్స్ కాదు.. పైథాన్ డ్యాన్స్``, ``అంకుల్ పూర్తిగా నాగపాములా మారిపోయాడు``, ``అంకుల్ ఈ లోకంలో లేడు``, ``డ్యాన్స్ అద్భుతంగా ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ పజిల్ మీ సామర్థ్యానికి పరీక్ష.. ఈ ఫొటోలోని మూడు ముఖ్యమైన తేడాలను కనిపెట్టండి!


Viral Video: ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూడలేదే.. వేడి నుంచి ఉపశమనం కోసం డ్రైవర్ ఏం చేస్తున్నాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 25 , 2024 | 11:33 AM