Share News

Viral Video: వామ్మో.. పులితో ఆటంటే ఇలా ఉంటుందా? ఒళ్లు గగుర్పొడిచే వీడియో చూడండి..!

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:30 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని మనకు నవ్వు తెప్పిస్తే, మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Viral Video: వామ్మో.. పులితో ఆటంటే ఇలా ఉంటుందా? ఒళ్లు గగుర్పొడిచే వీడియో చూడండి..!
టైగర్

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని మనకు నవ్వు తెప్పిస్తే, మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పులి (Tiger) ఓ వ్యక్తితో ఆడిన ఆట చాలా మందికి గూస్‌బంప్స్ తెప్పించింది (Viral Video).


nouman.hassan అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పులి దగ్గరకు ఓ వ్యక్తి వెళ్లాడు. అతడు ఆ పులికి సంరక్షకుడు లేదా యజమాని అయి ఉంటాడని చాలా మంది భావిస్తున్నారు. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చినపుడు పులి అనూహ్యంగా అతడిపై దాడికి దిగింది (Tiger attacks man). అతడి పైకి ఎగిరి అతడిని కిందకు లాగి పడేసింది. అయితే ఆ వ్యక్తి భయపడకుండా దీటుగా స్పందించి ఆ పులిని నియంత్రించాడు. దీంతో ఎవరికీ గాయాలు కాకుండా పెద్ద ప్రమాదం తప్పింది.


ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. దాదాపు 2.8 లక్షల మంది వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``కొన్నింటిని అడవిలోనే ఉంచడం మంచిది``, ``ఇది చాలా మూర్ఖత్వం``, ``ఆ పులి తన యజమానితో సరదాగా ఆడుకుంటుంది``, ``వన్య ప్రాణులను బోనులో బంధించడం నీచం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Puzzle: మీ బ్రెయిన్‌కు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో ఉన్న తప్పేంటో 6 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: తాగిన మైకంలో టపాసులతో ఆటలు.. చివరకు తగిన శాస్తి జరిగింది.. వీడియో వైరల్!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 17 , 2024 | 12:30 PM