Share News

Optical illusion: మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. ఈ చిత్రంలో దాక్కున్న కీటకాన్ని 30 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..

ABN , Publish Date - Apr 24 , 2024 | 02:55 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలు నెటజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. అయితే వీటిలో కొన్ని ఫొటోలను చూస్తే ఎలాంటి సందేహం రాదు. కానీ నిశితంగా పరిశీలిస్తే మాత్రం అందులో...

Optical illusion: మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. ఈ చిత్రంలో దాక్కున్న కీటకాన్ని 30 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..

సోషల్ మీడియాలో నిత్యం అనేక ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలు నెటజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. అయితే వీటిలో కొన్ని ఫొటోలను చూస్తే ఎలాంటి సందేహం రాదు. కానీ నిశితంగా పరిశీలిస్తే మాత్రం అందులో చాలా తేడాలు దాగి ఉంటాయి. అలాగే కొన్ని వస్తువులు కూడా దాక్కుని ఉంటాయి. ఇలాంటి వాటికి సమాధానాలు కనుక్కునే ప్రయత్నం చేయడం వల్ల మనలో ఏకాగ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. తాజాగా, మీ కోసం ఆ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో దాక్కున్న కీటకాన్ని 30 సెకన్లలో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..

సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో (Optical illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో వర్షపు నీటిలో చాలా ఆకులు రాలిపోయి ఉన్నాయి. ఇక్కడ ఎంత గమనించినా వర్షపు నీరు, రకరకాల ఆకులు తప్ప ఇంకేమీ లేనట్లు అనిపిస్తుంది. కానీ ఇందులోనే ఓ కీటకం (insect hides in leaves) కూడా దాక్కుని ఉంది. కానీ అది ఆకుల రంగులో కలిసిపోవడం వల్ల పైకి కనిపించదు.

Viral Video: వాసన చూసి గడ్డిలో వెతుక్కుంటూ వెళ్లిన పులి.. చివరకు ఎలా షాక్ ఇచ్చిందో చూడండి..

అయితే కాస్త నిశితంగా పరిశీలిస్తే మాత్రం ఈ కీటకాన్ని ఈజీగా కనిపెట్టవచ్చు. చాలా మంది కీటకాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే దాన్ని గుర్తిస్తు్న్నారు. ఇంకెందుకు ఆలస్యం అదెక్కడుందో కనిపెట్టేందుకు ప్రయత్నం చేయండి. ఎంత ప్రయత్నించినా ఆ కీటకాన్ని కనిపెట్టడం మీకు కష్టంగా అనిపిస్తుంటే.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

optical-illusion.jpg

Optical illusion: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును.. 10 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..

Updated Date - Apr 24 , 2024 | 02:55 PM