Share News

Phone Tapping Case: ప్రభాకర్‌కు రెడ్‌ కార్నర్ నోటీసులపై హైదరాబాద్ సీపీ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Apr 26 , 2024 | 01:14 PM

Telangana: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోందన్నారు. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయలేదని సపష్టం చేశారు. ఊహాగానాలతో దర్యాప్తును ఇబ్బంది పరుస్తున్నారని అన్నారు. రాజకీయ నేతల ప్రమేయంపై కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.

Phone Tapping Case: ప్రభాకర్‌కు రెడ్‌ కార్నర్ నోటీసులపై హైదరాబాద్ సీపీ షాకింగ్ కామెంట్స్
Hyderabad CP Kothakota Srinivas Reddy

హైదరాబాద్, ఏప్రిల్ 26: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై (Phone Tapping Case) హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (Hyderabad CP Kothakota Srinivas Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోందన్నారు. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయలేదని సపష్టం చేశారు. ఊహాగానాలతో దర్యాప్తును ఇబ్బంది పరుస్తున్నారని అన్నారు. రాజకీయ నేతల ప్రమేయంపై కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. ప్రభాకర్ రావును పట్టుకోవడం లేదనేది వార్త అవాస్తవమన్నారు. ప్రభాకర్ దర్యాప్తు అధికారులకు అందుబాటులోకి రాలేదని.. సరైన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలు వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు.

Freshers Hiring: ఫ్రెషర్లకు శుభవార్త.. ప్రముఖ టెక్ కంపెనీలో 6 వేల కోలువులు


ప్రభాకర్ రావు ఎక్కడున్నాడో ఇప్పటివరకు తెలియదన్నారు. ఈ కేసులో నిందితులంతా చాలా స్మార్ట్‌గా, ఇంటలిజెంట్‌గా వ్యవహరించారని తెలిపారు. తమ శక్తి మేరకు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. వ్యక్తిగత జీవితాలకు భంగం కలిగించేలా టాపింగ్ చేశారన్నారు. వ్యక్తిగత జీవితాలలోకి ప్రవేశించడం అనేది ఘోరమైన నేరమన్నారు. నలుగురు పోలీస్ ఆఫీసర్స్ ప్రమేయం ఉందని.. వారిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కేసులో మరి కొంత మంది పోలీసులను సాక్షులగా పెట్టామమన్నారు. సాక్షుల స్టేట్మెంట్లను రికార్డ్ చేశామన్నారు. అలాగే ప్రభాకర్ రావుపై ఎల్‌వోసీ జారీ చేసినట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

Congress: హరీష్‌రావు రాజీనామా స్పీకర్ ఫార్మాట్‌లో లేదు: మంత్రి కోమటిరెడ్డి

CM Revanth: రుణమాఫీ చేసి తీరుతాం... హరీష్ రాజీనామా రెడీగా పెట్టుకో.. రేవంత్ కౌంటర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 26 , 2024 | 03:41 PM