Room Heater: చలిగా ఉందని రూమ్ హీటర్ వాడుతున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే..

ABN, Publish Date - Dec 16 , 2023 | 04:43 PM

చలికాలంలో ఇంట్లో వెచ్చగా ఉండేందుకు చాలా మంది హీటర్లు వాడుతుంటారు. అయితే వాటి వల్ల కలిగే నష్టాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Room Heater: చలిగా ఉందని రూమ్ హీటర్ వాడుతున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే.. 1/5

హీటర్ల కారణంగా గదిలోని తేమ శాతం తగ్గిపోతుంది. ఇది పొడి చర్మం, శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల చర్మం పొడిబారడం, దురదలు తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి. గదిలో తేమ లేకపోవడం వల్ల శ్వాసపై ప్రభావం చూపడమే కాకుండా ఉబ్బసం వంటి సమస్యలు తలెత్తుతాయి.

Room Heater: చలిగా ఉందని రూమ్ హీటర్ వాడుతున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే.. 2/5

గదిలో హీటర్ల వాడకం వల్ల అగ్నిప్రమాదం సంభవించే ప్రమాదం ఉంది. మండే పదార్థాలను హీటర్‌కు దూరంగా ఉంచాలి. ప్రధానంగా రాత్రి వేళల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Room Heater: చలిగా ఉందని రూమ్ హీటర్ వాడుతున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే.. 3/5

కొన్ని హీటర్లు కార్బన్ మోనాక్సైడ్‌ను విడుదల చేస్తాయి. దీని వల్ల తలనొప్పి, వికారం, మైకం వంటి సమస్యలు పెరిగిపోతాయి. దీన్నుంచి అధిగమించేందుకు గదిలో సరైన వెండిలేషన్ ఉండేలా చూసుకోవాలి. అలాగే కార్బన్ మోనాక్సైడ్‌ డిటెక్టర్‌లను వినియోగించాలి.

Room Heater: చలిగా ఉందని రూమ్ హీటర్ వాడుతున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే.. 4/5

కొన్ని రకాల హీటర్లు ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. దీనివల్ల చర్మ సమస్యలతో పాటూ కళ్ళు పొడిబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే హీటర్‌ను ఆఫ్ చేయాలి. అలాగే నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి.

Room Heater: చలిగా ఉందని రూమ్ హీటర్ వాడుతున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే.. 5/5

ఆస్తమా లేదా శ్వాసకోశ రోగులు ఎక్కువసేపు రూమ్‌ హీటర్‌ వినియోగించకూడదు. దీనివల్ల గదిలో ఆక్సిజన్ స్థాయి తగ్గవచ్చు. ఇది శ్వాస సమస్యలకు దారి తీస్తుంది.

Updated at - Dec 16 , 2023 | 04:43 PM