Share News

Kesineni Chinni: వైసీపీ నాయకులకు తొత్తులుగా డీజీపీ, సీపీ

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:34 PM

ముఖ్యమంత్రిపై రాయి దాడి కేసులో పోలీసులు దర్యాప్తుపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని విజయవాడ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని (శివనాథ్) తెలిపారు. ముఖ్యమంత్రి వెళ్లే మార్గంలో కరెంటు ఎందుకు కట్ చేశారో ఇప్పటి వరకూ స్పష్టం చేయలేదన్నారు. రాష్ట్ర డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్ వైసీపీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు.

Kesineni Chinni: వైసీపీ నాయకులకు తొత్తులుగా డీజీపీ, సీపీ

అమరావతి: ముఖ్యమంత్రిపై రాయి దాడి కేసులో పోలీసులు దర్యాప్తుపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని విజయవాడ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని (Kesineni Chinni) తెలిపారు. ముఖ్యమంత్రి వెళ్లే మార్గంలో కరెంటు ఎందుకు కట్ చేశారో ఇప్పటి వరకూ స్పష్టం చేయలేదన్నారు. రాష్ట్ర డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్ వైసీపీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. తక్షణం డీజీపీని విజయవాడ పోలీస్ కమిషనర్‌ని వెంటనే మార్చేయాలన్నారు. కొంతమంది పోలీస్ అధికారులు ప్రతిపక్ష నాయకుల గొంతులు కోయడానికా ఉందని ప్రశ్నించారు.

Ayodhya: అయోధ్య రాముడి నుదట సూర్య తిలకం.. వీక్షించేందుకు తరలివస్తున్న భక్తులు


12 వందల మంది పోలీసులు పహారా పెట్టుకున్నప్పటికీ.. ముఖ్యమంత్రి భద్రతకు కలిగిన వైఫల్యాన్ని ప్రతిపక్ష నాయకుల మీదకి నెట్టడానికి బుద్ధి ఉండాలని కేశినేని చిన్ని మండిపడ్డారు. అన్యం పుణ్యం తెలియని పది మంది బీసీ యువకులను అరెస్ట్ చేశారన్నారు. బోండా ఉమని ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అటువంటి చర్యలకు పాల్పడితే తగ్గిన రీతిలో బుద్ధి చెబుతామని కేశినేని చిన్ని హెచ్చరించారు. జరిగిన ఘటనపై ఎలక్షన్ కమిషన్, గవర్నర్ కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. డీజీపీతో పాటు పోలీస్ కమిషనర్ ఇక్కడే ఉంటే ఎన్నికలు సజావుగా సాగవన్నారు. కోడి కత్తి కేసు ఐదు సంవత్సరాల పాటు సాగదీశారని.. గులక రాయి కేసు కూడా అంతేనన్నారు. దొంగ కేసులు పెట్టే అధికారులను ఎవరినీ కూడా ఉపేక్షించేది లేదని కేశినేని చిన్ని అన్నారు.

ఇవి కూడా చదవండి..

KCR: బాబోయ్.. కేసీఆర్ ఇంటివద్ద క్షుద్ర పూజలు..!

Chandrababu: అందరికీ నవమి శుభాకాంక్షలు.. ప్రజల ఆనందమే ముఖ్యమని చెబుతోంది రామకథ..

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 17 , 2024 | 12:34 PM