Share News

AP Elections: వైసీపీలో సరికొత్త టెన్షన్.. అభ్యర్థులపై అధిష్టానం ఒత్తిడి..

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:26 PM

ఓ వైపు సర్వేలన్నీ ఎన్డీయే కూటమిదే గెలుపు అని అంచనా వేస్తున్నాయి. మరోవైపు ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. రెండోసారి అధికారంలోకి రావడం కోసం వైసీపీ (YSRCP) తీవ్రంగా శ్రమి స్తోంది. ఎన్ని వ్యూహాలు, కుట్రలు పన్నినా విఫలమవు తుండటంతో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలవుతోందట.

AP Elections: వైసీపీలో సరికొత్త టెన్షన్.. అభ్యర్థులపై అధిష్టానం ఒత్తిడి..
YS JAGAN

ఓ వైపు సర్వేలన్నీ ఎన్డీయే కూటమిదే గెలుపు అని అంచనా వేస్తున్నాయి. మరోవైపు ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. రెండోసారి అధికారంలోకి రావడం కోసం వైసీపీ (YSRCP) తీవ్రంగా శ్రమిస్తోంది. ఎన్ని వ్యూహాలు, కుట్రలు పన్నినా విఫలమవుతుండటంతో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలవుతోందట. ఐదేళ్లలో గొప్పగా పాలించామని చెప్పుకుంటున్న జగన్‌కు.. ఎన్నికల ఫలితాల్లో నిరాశ ఎదురైతే.. పార్టీ పరిస్థితి ఏమిటనే ఆందోళనలో కొందరు సీనియర్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో గెలుపు కోసం అభ్యర్థులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు తెలస్తోంది.


రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే వైసీపీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నా.. ప్రజల్లో సానుకూలత కనిపించడం లేదనే ప్రచారం జరుగుతోంది. పక్కాగా 20 నుంచి 30 మంది గెలవచ్చని వైసీపీ అంతర్గత సర్వేలో తేలినట్లు సమాచారం. ఈ సర్వే చూసిన తర్వాత జగన్ (YS Jagan) అభ్యర్థులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారట. ఏమి చేస్తారో తెలీదు.. మీరు గెలవాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు అభ్యర్థులకు ఫోన్లు చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలుసుకుంటున్నారు. దీంతో అభ్యర్థులు మరికొంత ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది అభ్యర్థులు అయితే అధిష్టానం వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

YCP: ద్వారకా తిరుమలలో వైసీపీ నాయకులతో కలిసి అధికారుల బరితెగింపు


వైసీపీపై వ్యతిరేకత..

వైసీపీ ఐదేళ్ల పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో వైసీపీ నాయకులు ప్రచారానికి వెళ్తుంటే తమ గ్రామంలో రోడ్లు లేవని, పిల్లలకు ఉద్యోగాలు రాలేదని ఇలా ఎవరి సమస్యలు వారు చెప్పుకుంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను నిలదీస్తున్నారు. దీంతో ఎటువంటి సమాధానం చెప్పాలో నాయకులకు తెలియడం లేదు. ఓవైపు సీఎం జగన్ దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెబుతుంటే.. మరోవైపు మీరు ఈ ఐదేళ్లు ఏం చేశారని ప్రజలు నిలదీస్తుంటే నాయకుల దగ్గర సమాధానమే కరువైందట. దీంతో కొంతమంది అభ్యర్థులకు ప్రచారం చేయడమే కష్టంగా మారినట్లు తెలుస్తోంది.


కొన్ని నియోజకవర్గాల్లో ఇలా

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నుంచి వైసీపీ అభ్యర్థిగా స్పీకర్ తమ్మినేని సీతారాం పోటీ చేస్తున్నారు. ఆయన గ్రామాల్లో తిరుగుతుంటే సొంత పార్టీ నేతలే సహకరించడంలేదనే టాక్ వినిపిస్తోంది. ఐదేళ్ల పాటు పదవిలో ఉండి ఎవరినీ పట్టించుకోలేదని, మరోసారి ఎన్నికల వేళ ప్రజలు గుర్తొచ్చారా అంటూ తమ్మినేనిని ప్రశ్నిస్తున్నారు జనం. దీంతో ఏం చేయాల్లో నాయులకు పాలుపోవడం లేదట. దాదాపు ఒకట్రెండు నియోజకవర్గాలు తప్పితే ఈ జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల పరిస్థితి ఇదే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.


ప్రజల రియాక్షన్ చూసిన తర్వాత తాము గెలవడం కష్టమనే అభిప్రాయానికి కొందరు నేతలు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇవే పరిస్థితులు ఉన్నట్లు వైసీపీ అంతర్గత సర్వేలో తేలడంతో జగన్‌లో సరికొత్త ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న ప్రజల దృష్టిని మరల్చేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం పక్కన పెడితే అవి తిరిగి తమకు మరింత వ్యతిరేకంగా మారుతున్నాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఈ క్రమంలో అధిష్టానం చేస్తున్న ఒత్తిడిపై కొందరు నేతలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి మరి.


AP Elections: మదనపల్లి చుట్టూ ఔటర్ ఏది..? ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయిందా: షర్మిల

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 17 , 2024 | 12:26 PM