Share News

ABN Big Debate: ఆ సమయంలో ఫోన్ వచ్చింది.. సంచలన విషయాలు వెల్లడించిన సునీత భర్త..

ABN , First Publish Date - May 06 , 2024 | 07:17 PM

ABN Big Debate with YS Sunitha: ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్‌లో దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందనే విషయాలను కూలంకశంగా వివరించారు.

ABN Big Debate: ఆ సమయంలో ఫోన్ వచ్చింది.. సంచలన విషయాలు వెల్లడించిన సునీత భర్త..
ABN Big Debate with YS Sunitha

Live News & Update

  • 2024-05-06T20:19:21+05:30

    హంతకులు ఎవరో కనుక్కోలేకపోతే తనకు అవమానం అని జగన్ అన్నారు: సునీత

    ఎస్పీ మొహంతిని కంటిన్యూ చేస్తారా? అని జగన్‌ను అడిగాను. కంటిన్యూ చేస్తానని జగన్ చెప్పారు. నాకు మొదట్లో కృష్ణారెడ్డి, రంగన్నపై అనుమానం ఉంది. కానీ, సొంత మనుషులే ఈ హత్య చేయించారని క్లూ లేదు. జగన్ సీఎం అయ్యాక సెప్టెంబర్‌లో ఓసారి కలిశాను. అప్పటికే సొంతవాళ్లు ఈ హత్య చేయించినట్లు క్లారిటీ వచ్చింది. కొంతమందిపై అనుమానం ఉందని జగన్‌కు చెప్పాం. నర్రెడ్డిని కూడా చాలా మంది అనుమానిస్తున్నట్లు జగన్ అన్నారు. ఎవరైనా సరే అరెస్ట్ చేయాల్సిందేనని మా అమ్మ అన్నారు. తర్వాత చాలాసార్లు అపాయింట్‌మెంట్ అడిగినా జగన్ ఇవ్వలేదు. విజయమ్మతో ఫోన్ చేయిస్తే చివరకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఆ రోజు దగ్గర బంధువులందరినీ తీసుకుని జగన్ వద్దకు వెళ్లాను. జగన్ ఇంటికి మేము వెళ్లేసరికి.. డీజీపీ, సజ్జల రామకృష్ణా రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి అక్కడ ఉన్నారు. నా అనుమానాలన్నీ పేపర్‌లో రాసుకుని వెళ్లాను. అవినాష్ పేరును కావాలనే పేపర్‌లో నేను రాయలేదు. ఆ పేపర్ తనకు కావాలని డీజీపీ ఒక కాపీ తీసుకున్నారు. దర్యాప్తు స్వతంత్ర సంస్థకు ఇవ్వొచ్చుగా అన్నాను. సీబీఐకి ఇస్తే అవినాష్ బీజేపీలోకి వెళ్తాడని జగన్ అన్నారు. సీబీఐకి ఇస్తే తనపై ఉన్న 11 కేసులకు మరోటి జత అవుతుందన్నారు.

  • 2024-05-06T20:01:34+05:30

    లెటర్‌ను దాచింది అందుకే : రాజశేఖర్ రెడ్డి

    కృష్ణారెడ్డి లెటర్ ఉందని చెప్పాడు. అందులో ప్రసాదే వివేకాను కొట్టి చంపినట్లు రాసి ఉందని చెప్పాడు. అప్పుడు డౌట్ వచ్చింది. అంతకు ముందే ప్రసాద్‌తో మాట్లాడాను. ఇది ఖచ్చితంగా హత్య అయి ఉంటుందని అర్థమైంది. అందుకే.. లెటర్ బయటపడితే ఆ ప్రసాద్‌ను కూడా ఏమైనా చేస్తారేమో అని లెటర్ దాయమని చెప్పాను.

  • 2024-05-06T19:57:18+05:30

    మళ్లీ కృష్ణా రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది: రాజశేఖర్ రెడ్డి

    లేటర్ ఉందని ఫోన్‌లో కృష్ణా రెడ్డి చెప్పారు. లేటర్ చదివి వినిపించమని అడిగాను. గజిబిజిగా ఉందని.. చదవడానికి వీలు కాదని అతను చెప్పాడు. కానీ, కొంచెం టైమ్ తీసుకొనైనా చదవమని అడిగాను. దాంట్లో ‘ప్రసాద్ నన్ను త్వరగా ఇంటికి రమ్మని చెప్పి చచ్చేటట్టు కొట్టారు’ అని చెప్పాడు. కానీ, అంతకు ముందే ప్రసాద్‌తో మాట్లాడాను. అదే విషయంలో డౌట్ వచ్చింది. లేటర్‌ను జాగ్రత్తగా పెట్టమని కృష్ణా రెడ్డికి చెప్పాను.

  • 2024-05-06T19:56:41+05:30

    వివేకాతో వెళ్లిన డ్రైవర్ ప్రసాద్‌కి కాల్ చేశాను: రాజశేఖర్

    ప్రసాద్‌కు కాల్ చేశాను. వివేకా రాత్రి భోజనం చేశారా? డ్రింక్ ఏమైనా చేశారా? అని అడిగాను. భోజనం టేబుల్ మీద పెట్టాను. డ్రింక్ తీసుకోలేదని చెప్పాడు. కానీ, అది అబద్ధం. వివేకా డ్రింక్ చేసింది లేదు అనేది అతనికి కూడా తెలియదు. నేను తిడతానని ప్రసాద్ అబద్ధం చెప్పాడు.

  • 2024-05-06T19:49:41+05:30

    పని చేసే పిల్లాడికి కాల్ చేశా: రాజశేఖర్

    పులివెందులలో మా ఇంట్లో పని చేసే పిల్లాడికి ఫోన్ చేశాను. తాను ఇంట్లో లేనని.. కాణిపాకం వెళ్లానని, దారి మధ్యలో మా అక్క వాళ్ల ఇంట్లో ఉన్నానని చెప్పాడు.

  • 2024-05-06T19:46:47+05:30

    అందుకే నమ్మాము..: రాజశేఖర్ రెడ్డి

    పీఏ కృష్ణారెడ్డి ఫోన్ చేశారు. రాజశేఖర్.. బావ మనకు లేరు అని చెప్పారు. బాత్‌రూమ్‌లో పడి ఉన్నారు. బ్లడ్ వాంతి చేసుకున్నట్లున్నాడు. చనిపోయి ఉన్నారు అని చెప్పారు. వివేకాకు అప్పటికే స్టంట్ వేశారు. సిగరేట్ తాగేవారు, ఆల్కాహాల్ తాగేవారు. అందుకే కృష్ణా రెడ్డి చెప్పింది నమ్మాము.

  • 2024-05-06T19:31:55+05:30

    వివేకాకు కృష్ణారెడ్డి అధికారిక పీఏ కాదు: రాజశేఖర్‌రెడ్డి

    • ఇంటి పనులు, వ్యక్తిగత పనులు చూసేవాడు

  • 2024-05-06T19:30:03+05:30

    రాజశేఖర్‌రెడ్డికి ఫోన్‌కాల్‌ వచ్చినట్లు నాకు తెలుసు: సునీత

    • అమ్మకు కృష్ణారెడ్డి ఫోన్‌ చేసి మాట్లాడాడు

    • మేం చెప్పడానికి ముందే అమ్మకు కృష్ణారెడ్డి చెప్పాడు

    • వివేకా రాసిన లేఖను కృష్ణారెడ్డి చదివి వినిపించాడు

    • నేను వచ్చేదాకా లేఖను దాచిపెట్టాలని కృష్ణారెడ్డికి చెప్పా

    • లెటర్‌ దాచినందుకు శిక్ష పడినా పర్లేదు అనుకున్నా

    • లెటర్‌ను చూస్తే వివేకాను హత్య చేసినట్లు అర్థమైంది

  • 2024-05-06T19:28:53+05:30

    ఇప్పుడు సునీత లా చదువుతా అంటున్నారు: రాజశేఖర్‌రెడ్డి

    • ఉదయం 6:15కి నాకు ఫోన్‌కాల్‌ వచ్చింది

    • వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫోన్‌ చేసి చెప్పారు

    • వివేకా రక్తపు వాంతులతో చనిపోయినట్లు చెప్పాడు

    • మొదట్లో కృష్ణారెడ్డి పాత్ర లేదనుకున్నా

    • కానీ, అతడి పాత్ర కూడా ఉందని తర్వాత తెలిసింది

  • 2024-05-06T19:27:49+05:30

    ఈ పోరాటం నాకు తెలిసిన విద్య కాదు: సునీత

    • ఏమీ తెలియదు కాబట్టే ఇక్కడిదాకా పోరాడా

    • పోరాటంలో చాలామంది సలహాలు తీసుకున్నా

    • నా పోరాటం ఆగదు.

  • 2024-05-06T19:26:47+05:30

    వివేకా హత్య కేసులో ఏమీ తెలియదు కాబట్టే.. ఇక్కడిదాకా పోరాడా: డాక్టర్ సునీత

    • పోరాటంలో చాలామంది సలహాలు తీసుకున్నా

    • నా పోరాటం ఆగదు.

  • 2024-05-06T19:00:54+05:30

    ABN Big Debate with YS Sunitha: ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్‌లో దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందనే విషయాలను కూలంకశంగా వివరించారు. వివేకా హత్య జరిగిన రోజున చోటు చేసుకున్న సంచలన విషయాల గురించి తెలుసుకోవడానికి ఈ డిబేట్ చూడాల్సిందే..