Share News

AP New DGP: ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ గుప్తా..

ABN , Publish Date - May 06 , 2024 | 03:27 PM

AP New DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ గుప్తా నియామకం అయ్యారు. తక్షణమే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశించింది.

AP New DGP: ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ గుప్తా..
AP New DGP

AP New DGP: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) నూతన డీజీపీగా(AP New DGP) హరీష్ గుప్తా(Harish Gupta) నియామకం అయ్యారు. తక్షణమే విధుల్లో చేరాలని ఈసీ(Election Commission) ఆదేశించింది. సాయంత్రం 5 గంటల లోపు బాధ్యతలు తీసుకోవాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది ఈసీ. ఎన్నికల్లో పక్షపాతవైఖరిని అవలంభిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ పదవి నుంచి బదిలీచేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతిపాదించగా.. రవికుమార్ గుప్తా పేరును డీజీపీగా సెలక్ట్ చేసింది ఈసీ. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ.. ఇవాళ సాయంత్రం లోగా డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టాలని స్పష్టం చేసింది.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 06 , 2024 | 03:32 PM