Share News

AP News: దాంతో పోల్చితే బొటనవేలు కోసుకున్న బాధ పెద్దది కాదన్న కోవూరి లక్ష్మీ

ABN , Publish Date - Apr 23 , 2024 | 02:27 PM

Andhrapradesh: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ అవినీతి అరాచక పాలనకు నిరసనగా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద గుంటూరుకు చెందిన కోవూరు లక్ష్మీ బొటన వేలు కోసుకున్న విషయం తెలసిందే. అయితే రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయంతో పోల్చితే బొటన వేలు కోసుకున్న బాధ పెద్దది కాదని లక్ష్మీ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు స్వర్ణభారతి నగర్‌లో వైసీపీ నేతలు మైనర్ పిల్లలను గంజాయికి అలవాటు చేసి వారిని..

AP News: దాంతో పోల్చితే బొటనవేలు కోసుకున్న బాధ పెద్దది కాదన్న కోవూరి లక్ష్మీ

అమరావతి, ఏప్రిల్ 23: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) అవినీతి అరాచక పాలనకు నిరసనగా ఢిల్లీలోని (Delhi) ఇండియా గేట్ వద్ద గుంటూరుకు చెందిన కోవూరు లక్ష్మీ బొటన వేలు కోసుకున్న విషయం తెలసిందే. అయితే రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయంతో పోల్చితే బొటన వేలు కోసుకున్న బాధ పెద్దది కాదని లక్ష్మీ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు స్వర్ణభారతి నగర్‌లో వైసీపీ నేతలు మైనర్ పిల్లలను గంజాయికి అలవాటు చేసి వారిని మాదకద్రవ్యాలకు బానిసలుగా మార్చారన్నారు.

AP Elections: జడ్జి ముందు ప్రమాణం చేసిన చంద్రబాబు.. ఎందుకంటే..?


తల్లిదండ్రులు పనికి వెళ్తే, ఇంట్లో ఉండే మైనర్ బాలికలకు కూడా గంజాయి అలవాటు చేసి వారిపైనా అఘాయిత్యాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఎమ్మార్వో సంతకాన్ని ఫోర్జరీ చేసి దొంగ పట్టాలు సృష్టించి పేదల భూములు దోచుకున్నారన్నారు. గంజాయి అమ్మే వైసీపీ నేతల్ని వదిలి దళిత బిడ్డల్ని జైల్లో పెట్టారన్నారు. జరుగుతున్న అన్యాయాన్ని ఫిర్యాదు చేస్తే, తమపై ఎదురు కేసులు పెట్టారన్నారు. హోం మంత్రి నుంచి ఎవ్వరూ కూడా తన ఫిర్యాదును పట్టించుకోకపోవటంతో విషయాన్ని అందరికీ తెలపాలనే ఢిల్లీ వెళ్లి వేలు కోసుకోవాల్సి వచ్చిందని కోవూరి లక్ష్మీ వెల్లడించారు.


దీనిపై సీఎం సమాధానం చెప్పాలి: వర్ల

ఒక దళిత బిడ్డ ఢిల్లీ వెళ్లి బొటన వేలు కోసుకునే దుస్థితి ఎందుకు వచ్చిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. గుంటూరు స్వర్ణభారతి నగర్‌లో గంజాయి అమ్మకంతో పాటు అసాంఘిక చర్యలు సాగుతున్నాయని ఎన్నోసార్లు లక్ష్మీ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందంటానికి లక్ష్మీ ఉదంతమే ఓ ఉదాహరణ అని వర్ల రామయ్య పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Breaking: కవితకు మరో బిగ్ షాక్.. ఇప్పట్లో కష్టమే!

Btech Ravi: వివేకా హత్యపై ఎవరూ మాట్లాడవద్దంటూ కడప కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టుకు..

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 23 , 2024 | 03:00 PM