Share News

Elections Offer: మొదటిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సూపర్ ఆఫర్

ABN , Publish Date - Apr 18 , 2024 | 03:49 PM

రేపు దేశవ్యాప్తంగా 2024 లోక్‌సభ ఎన్నికల(lok sabha election 2024) మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్(air india express) అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ రాబోయే 18వ లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి దేశంలోని యువతను సమీకరించడానికి #VoteAsYouAre ప్రచారాన్ని ప్రారంభించింది.

Elections Offer: మొదటిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సూపర్ ఆఫర్
air india express offer for first time voters

రేపు దేశవ్యాప్తంగా 2024 లోక్‌సభ ఎన్నికల(lok sabha election 2024) మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్(air india express) అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఏప్రిల్ 29న తన 19వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఎయిర్‌లైన్ ప్రజలు, ప్రదేశాలు. సంస్కృతులను అనుసంధానించే వారసత్వానికి అనుగుణంగా మొదటిసారి ఓటర్ల కోసం సరికొత్త డిస్కౌంట్(discount) ప్రకటించింది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ రాబోయే 18వ లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి దేశంలోని యువతను సమీకరించడానికి #VoteAsYouAre ప్రచారాన్ని ప్రారంభించింది.


ఈ నేపథ్యంలో 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్నవారు ఓటు వేసేందుకు వారి సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ విమానయాన సంస్థ మొదటి సారి తన దేశీయ, అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో 19% తగ్గింపును అందిస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 18 నుంచి జూన్ 1, 2024 మధ్య ఓటర్లు సంబంధిత నియోజకవర్గానికి సమీపంలోని విమానాశ్రయానికి ప్రయాణించడం కోసం ఈ ఎయిర్‌లైన్స్ బుక్(bookigs) చేసుకోవచ్చని తెలిపింది. మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ airindiaexpress.comలో బుకింగ్‌లు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లైట్, ఎక్స్‌ప్రెస్ వాల్యూ, ఎక్స్‌ప్రెస్ ఫ్లైక్స్, ఎక్స్‌ప్రెస్ బిజ్ విభాగాల్లో ఈ ఆఫర్(offer) వర్తిస్తుందని ప్రకటించింది.


మన దేశ భవిష్యత్తును పెంపొందించడంలో యువత(young people) కీలక పాత్ర పోషిస్తారని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ డాక్టర్ అంకుర్ గార్గ్ ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. వారిని ఉత్తేజపరిచి మొదటి సారి ఓటు హక్కును వినియోగించుకునేలా సులభతరం చేయాలనుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఈ చొరవ భారతదేశంలోని(india) యువత తమ ఓటు హక్కును వినియోగించుకుని దేశ భవిష్యత్తును రూపొందించడంలో పాల్గొనడాన్ని ప్రోత్సహిస్తుంది.


ఇది కూడా చదవండి:

SIP: ప్రతి రోజు రూ.110 ఇన్‌వెస్ట్ చేయండి.. కోటీశ్వరులుగా మారండి

Business Idea: ఉద్యోగానికి బై చెప్పేసి రూ.50,000తో వ్యాపారం.. ఇప్పుడు నెలకు లక్షల్లో ఆదాయం!


మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Apr 18 , 2024 | 05:05 PM