Share News

Hyderabad: హాస్టల్‌ సంపులో పడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

ABN , Publish Date - Apr 23 , 2024 | 09:06 AM

హాస్టల్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి(Software employee) ఉసురు తీసింది. బయటికెళ్లిన అతను.. హాస్టల్‌ గేటు దగ్గర ఉన్న సంప్‌ మూత తెరిచి ఉండడాన్ని గమనించకుండా అందులో పడి మృతి చెందాడు.

Hyderabad: హాస్టల్‌ సంపులో పడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

- నిర్వాహకుడి నిర్లక్ష్యమే కారణం

హైదరాబాద్: హాస్టల్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి(Software employee) ఉసురు తీసింది. బయటికెళ్లిన అతను.. హాస్టల్‌ గేటు దగ్గర ఉన్న సంప్‌ మూత తెరిచి ఉండడాన్ని గమనించకుండా అందులో పడి మృతి చెందాడు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్‏స్టేషన్‌(Rayadurgam Police Station) పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన షేక్‌ అక్మల్‌ సుఫియాన్‌(25) రెండు సంవత్సరాల నుంచి గచ్చిబౌలి(Gachibowli) అంజయ్యనగర్‌లోని షణ్ముక్‌ పీజీ హాస్టల్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు.


ఆదివారం బయటకు వెళ్లిన అతను ఉదయం 10.30 గంటల సమయంలో తిరిగి హాస్టల్‌కు వచ్చాడు. గేటు తెరుచుకొని లోనికి వెళ్తుండగా.. నీటి సంపు మూత తెరిచి ఉండడాన్ని గమనించకుండా ప్రమాదవశాత్తు అందులో పడ్డాడు. ఈ క్రమంలో తల.. సంపు శ్లాబ్‌కు తగిలి ఉంటుందని అందరూ భావిస్తున్నారు.

ఇదికూడా చదవండి: TS News: గేదెలు అడ్డురావడంతో బ్రేక్ వేసిన డ్రైవర్.. అదుపు తప్పిన బస్సు ఎటు దూసుకెళ్లిందంటే..

సంపులో దాదాపు పది అడుగుల మేర నీళ్లున్నాయని, తలకు దెబ్బతగలడంతో నీటిలో మునిగి ఉంటాడని చెబుతున్నారు. సుఫియాన్‌ సంపులో పడినప్పుడు శబ్దం కావడంతో పక్కనే ఉన్న నిర్వాహకుడు మధుసూదన్‌రెడ్డి(Madhusudan Reddy), అతని కుటుంబ సభ్యులు సంపు వద్ద చూశారు. అయినా వారు గుర్తించలేక పోయారు.


కొద్దిసేపటి తర్వాత తిరిగి చూడగా అతను మృతి చెందినట్లు గుర్తించారు. దీంతో హాస్టల్‌ నిర్వాహకుడు మధుసూదన్‌రెడ్డి రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. సంప్‌ మూత తీసినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన మధుసూదన్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై హాస్టల్‌లో ఉంటున్న వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: కొండా’ ఆస్తులు 4,490 కోట్లు

Read More Crime News and Telugu News

Updated Date - Apr 23 , 2024 | 09:55 AM