Share News

Accident: ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం.. నలుగురు మృతి, 25 మందికి గాయాలు

ABN , Publish Date - Apr 23 , 2024 | 10:33 AM

ఉత్తర్‌ప్రదేశ్‌(uttar pradesh)లోని కన్నౌజ్‌(kannauj) లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(accident) జరిగింది. గోరఖ్‌పూర్‌ నుంచి ఢిల్లీకి వెళ్తున్న హైస్పీడ్‌ స్లీపర్‌ బస్సు(bus) డివైడర్‌ను ఢీకొట్టి అటువైపు నుంచి వస్తున్న ట్రక్కును బలంగా తాకింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా, బస్సులో ఉన్న మరో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

Accident: ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం.. నలుగురు మృతి, 25 మందికి గాయాలు
Lucknow Agra expressway accident

ఉత్తర్‌ప్రదేశ్‌(uttar pradesh)లోని కన్నౌజ్‌(kannauj) లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(accident) జరిగింది. గోరఖ్‌పూర్‌ నుంచి ఢిల్లీకి వెళ్తున్న హైస్పీడ్‌ స్లీపర్‌ బస్సు(bus) డివైడర్‌ను ఢీకొట్టి అటువైపు నుంచి వస్తున్న ట్రక్కును బలంగా తాకింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా, బస్సులో ఉన్న మరో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటనలో బస్సు, ట్రక్కు రెండూ దాదాపు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసు(police) బృందం ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులు, మృతులను ఆస్పత్రికి తరలించారు.


ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(yogi adityanath) మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. దీంతోపాటు ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే డీఎం శుభ్రాంత్ కుమార్ శుక్లా, ఎస్పీ అమిత్ కుమార్ ఆనంద్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతులను ఇంకా గుర్తించలేదని ఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. అయితే డ్రైవర్‌ నిద్రమబ్బులో ఉండి డ్రైవింగ్ చేయడం వల్లనే బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


ఇది కూడా చదవండి:

IMD: దేశంలో మరో 5 రోజులు మండే ఎండలు..ఈ ప్రాంతాలకు అలర్ట్


CIBIL Score: ఈ తప్పులు చేస్తున్నారా.. మీ సిబిల్ స్కోర్ ఖతం


Read Latest Crime News and Telugu News

Updated Date - Apr 23 , 2024 | 10:39 AM