Share News

UGC: ఈ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పీహెచ్‌డీ విషయంలో కీలక నిర్ణయం

ABN , Publish Date - Apr 22 , 2024 | 09:37 AM

పీహెచ్‌డీ(PHD) చేయాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఇకపై నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విద్యార్థులు కూడా పీహెచ్‌డీ చేయవచ్చని యూజీసీ ఛైర్మన్(UGC Chairman) జగదీష్ కుమార్(Jagadesh Kumar) ప్రకటించారు. దీంతోపాటు గ్రాడ్యుయేషన్ చేసిన సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా ఇప్పుడు వారు ఎంచుకున్న సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ చేయవచ్చని ఛైర్మన్ తెలిపారు.

UGC: ఈ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పీహెచ్‌డీ విషయంలో కీలక నిర్ణయం
Students with four year undergraduate degrees can now directly appear for NET

పీహెచ్‌డీ(PHD) చేయాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఇకపై నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విద్యార్థులు కూడా పీహెచ్‌డీ చేయవచ్చని యూజీసీ ఛైర్మన్(UGC Chairman) జగదీష్ కుమార్(Jagadesh Kumar) ప్రకటించారు. దీంతోపాటు గ్రాడ్యుయేషన్ చేసిన సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా ఇప్పుడు వారు ఎంచుకున్న సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ చేయవచ్చని ఛైర్మన్ తెలిపారు. నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విద్యార్థులు(degree students) ఇప్పుడు నేరుగా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET)కి హాజరుకావచ్చని, అలాగే పీహెచ్‌డీని కూడా చేయవచ్చని యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ చెప్పారు.


అందుకోసం సంబంధించిన కోర్సులో కనీసం 75 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్ కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు NET అభ్యర్థి కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. కానీ ఆ నిబంధనలను మార్చుతున్నట్లు యూజీసీ ఛైర్మన్‌ తెలిపారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) చైర్మన్, జగదీష్ కుమార్ PhD, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET)కి హాజరు కావడానికి అర్హత ప్రమాణాలలో ముఖ్యమైన మార్పులను ప్రకటించారు.


ఏదైనా సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ తీసుకున్న విద్యార్థులు NET చేసేందుకు అర్హులుగా పరిగణించబడతారు. కానీ ఇప్పుడు నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్ డిగ్రీ (UG) ఉన్న విద్యార్థులు కూడా NET రాయవచ్చు. భవిష్యత్తులో పీహెచ్‌డీ చేయాలనుకునే విద్యార్థులకు ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు. దీంతో పాటు నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ చేసిన సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా ఇప్పుడు వారు ఎంచుకున్న సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ చేయవచ్చని చైర్మన్(UGC Chairman) జగదీష్ కుమార్ వెల్లడించారు.

ఇంకా SC, ST, OBC (నాన్-క్రీమీ లేయర్), వికలాంగులు, ఆర్థికంగా బలహీన వర్గాలు మొదలైన కొన్ని వర్గాలకు చెందిన అభ్యర్థులకు మార్కుల సడలింపును UGC ఛైర్మన్ ప్రస్తావించారు. మొత్తంమీద ఈ మార్పులు PhD చదివే విద్యార్థులను ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయని స్పష్టం చేశారు.


ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) UGC NET జూన్ 2024 సెషన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.inని సందర్శించడం అప్లికేషన్లను పూర్తి చేయవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి చివరి తేదీ మే 10, 2024. ఆన్‌లైన్ మోడ్ ద్వారా పరీక్ష రుసుమును సమర్పించడానికి చివరి తేదీ మే 11 నుంచి మే 12, 2024 వరకు.


ఇది కూడా చదవండి:

Civils: సివిల్స్ లో సత్తా చాటిన ఓరుగల్లు ముద్దుబిడ్డ


AP SSC Results 2024: పదో తరగతి ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి..?


మరిన్ని చదువు వార్తల కోసం

Updated Date - Apr 22 , 2024 | 09:44 AM