Share News

Varicose Veins: కాళ్లూ చేతులలో నరాలు ఉబ్బిపోయి నీలం రంగులో కనిపిస్తున్నాయా? దీని గురించి ఆయుర్వేదం ఏం చెబుతోందంటే..!

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:30 PM

అనారోగ్యం ఏదీ లేకపోయినా శరీరానికి కొన్ని చిన్న చిన్న అసౌకర్యాలు ఉండనే ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో. చాలామందికి నరాలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలలో వెరికోస్ వెయిన్స్‌ కూడా ఒకటి.

Varicose Veins: కాళ్లూ చేతులలో నరాలు ఉబ్బిపోయి నీలం రంగులో కనిపిస్తున్నాయా? దీని గురించి ఆయుర్వేదం ఏం చెబుతోందంటే..!

ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు పెద్దలు. అనారోగ్యం ఏదీ లేకపోయినా శరీరానికి కొన్ని చిన్న చిన్న అసౌకర్యాలు ఉండనే ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో. చాలామందికి నరాలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలలో వెరికోస్ వెయిన్స్‌ కూడా ఒకటి. అసలు వెరికోస్ వెయిన్స్‌ అంటే ఏంటి? ఇది ఎందుకు వస్తుంది? ఆయుర్వేదం దీని గురించి ఏం చెబుతోంది? తెలుసుకుంటే..

సిరల పని గుండెకు రక్తాన్ని అందించడం. రక్త ప్రసరణలో కవాటాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కవాటాలు బలహీనంగా మారినప్పుడు, రక్త ప్రవాహం మందగించినప్పుడు, కవాటాల దగ్గర రక్తం చేరడం ప్రారంభమవుతుంది. ఇలా రక్తం స్తబ్దత కారణంగా సిరలు వాపు వస్తాయి. నరాలన్నీ కట్ట తాడులా కనిపిస్తుంటాయి. దీనివల్ల కాళ్లలో నొప్పి, తిమ్మిర్లు, వాపులు కూడా వస్తాయి. ఎక్కువ సేపు నిలబడటం లేదా తప్పు పొజిషన్లో ఎక్కువసేపు కూర్చోవడం అనే అలవాట్ల వల్ల వెరికోస్ వెయిన్స్‌ సమస్య వస్తుంది. వయసు పెరిగేకొద్దీ పెద్దవాళ్లలో కూడా ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య వచ్చినప్పుడు కాళ్ళలో వాపు, కండరాల తిమ్మిరి, నరాలు నీలి రంగులో ముద్దగా ఒకే చోట దట్టంగా మారి కనిపించడం. స్పైడర్ సిరలు, చర్మపు పుండ్లు మొదలైవి.

ఈ రాళ్లు వజ్రాల కంటే కూడా ఖరీదైనవి..!


ఆయుర్వేదం చెప్పిన చిట్కాలు..

ఆపిల్ వెనిగర్ తో మసాజ్ చేయాలి. ఆలివ్ నూనెతో మసాజ్ చేయవచ్చు. ఐస్ మసాజ్ చేయవచ్చు.

తిప్పతీగ, అశ్వగంధ, గుగ్గులు, పునర్నవ వంటి మందులు వైద్యుల సలహా మీద వాడచ్చు.

కప్పింగ్ థెరపీ, లీచ్ థెరపీ, మట్టితో పూత పూయడం, రేడియేషన్ థెరపీ వంటి చికిత్సలు కూడా ఈ సమస్యలో పనిచేస్తాయి.

వెరికోస్ వెయిన్స్ సమస్యను నివారించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం ముఖ్యం. సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కూర్చునేటప్పుడు సరైన పొజిషన్లో కూర్చోవడం, ఎక్కువసేపు ఒకేవిధంగా కూర్చోకుండా పొజిషన్ మార్చుకుంటూ ఉండటం, అప్పుడప్పుడు లేచి కొన్ని అడుగులు నడవడం వంటివి చేయడం వల్ల రక్తప్రవాహం బాగుంటుంది.

వేసవిలో ఈ మొక్కలు ఇంట్లో ఉంటే చాలు.. ఏసి కూడా పనికిరాదు!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 27 , 2024 | 01:30 PM