Share News

Watermelon vs muskmelon: పుచ్చకాయ లేదా కర్భూజ.. వేసవి తాపాన్ని తగ్గించడానికి ఏది బెస్ట్?

ABN , Publish Date - Apr 17 , 2024 | 04:20 PM

వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో కొన్ని రకాల పండ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాటిలో పుచ్చకాయ, కర్భూజ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి. అయితే పుచ్చకాయ, కర్భూజ రెండింట్లో ఏది శరీరాన్ని ఎక్కువ హైడ్రేట్ గా ఉంచుతుంది?

Watermelon vs muskmelon: పుచ్చకాయ లేదా కర్భూజ.. వేసవి తాపాన్ని తగ్గించడానికి ఏది బెస్ట్?

వేసవికాలం వచ్చిందంటే చాలా మంది భయపడతారు. బయటకు అలా కొద్దిసేపు వెళ్ళొచ్చినా సరే.. శరీరంలో తేమ శాతం చాలావరకు కోల్పోతుంది. అలసటగానూ, నీరసంగానూ కూడా అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో తిరిగి శరీరాన్ని ఉత్తేజంగా మార్చడంలో పండ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో కొన్ని రకాల పండ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాటిలో పుచ్చకాయ, కర్భూజ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి. అయితే పుచ్చకాయ, కర్భూజ రెండింట్లో ఏది శరీరాన్ని ఎక్కువ హైడ్రేట్ గా ఉంచుతుంది? రెండింటిలో ఏది బెస్ట్? తెలుసుకుంటే..

పుచ్చకాయ..

పుచ్చకాయ లోపలి భాగం ఎర్రగా ఉండటం వల్ల చాలా ఆకర్షణగా ఉంటుంది. ఇక దీని రుచి తినేకొద్ది తినాలనిపించేలా చేస్తుంది. పుచ్చకాయలో 90% పైగా నీరు ఉంటుంది. అందుకే ఈ పండు హైడ్రేషన్ కు పవర్‌హౌస్‌గా పిలవబడుతుంది. పుచ్చకాయను తింటే చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. పుచ్చకాయలో పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరం యొక్క ద్రవ సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది.

అధిక నీటి కంటెంట్‌తో పాటు పుచ్చకాయ లో విటమిన్లు A, C పుష్కలంగా ఉంటాయి. వేసవి వేడిని అధిగమించాలని చూసేవారికి పుచ్చకాయ మంచి ఎంపిక.

ఆడవాళ్లు పొరపాటున కూడా తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!


కర్భూజ..

కర్బూజ పండుకు పుచ్చకాయతో పోలి్స్తే కాసింత ఆదరణ తక్కువే. వాటర్ కంటెంట్ కూడా పుచ్చకాయ కంటే తక్కువగానే ఉంటుంది. కానీ శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో మాత్రం కర్భూజ కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో కూడా దాదాపు 90శాతం నీరు ఉంటుంది.

కర్భూజలో విటమిన్-ఎ, సి, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.

బీపీ పెషెంట్లు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడితే.. సేఫ్ గా ఉండొచ్చట!


రెండింటిలో ఏది బెస్ట్..

ఈ రెండు పండ్లను పోల్చి చూస్తే దేని ప్రాధాన్యత, దేని ప్రయోజనాలు దానికున్నాయి. పుచ్చకాయలో నీటి కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కర్భూజాలో నీటి కంటెంట్ పుచ్చకాయ కంటే తక్కువే ఉన్నా పోషకాల పరంగా చూస్తే ఎక్కువ ఉంటాయి. వేసవి కాలంలో వేడిని బీట్ చేయాలంటే ఈ రెండు పండ్లూ చక్కగా సహాయపడతాయి.

ఆడవాళ్లు పొరపాటున కూడా తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!

బీపీ పెషెంట్లు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడితే.. సేఫ్ గా ఉండొచ్చట!

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 17 , 2024 | 04:20 PM