Share News

Viral Video: ఈ ట్రిక్ ఏదో బాగుందే.. గిన్నెలను కడిగేందుకు నీరు లేక ఓ వ్యక్తి ఎలా తింటున్నాడో చూడండి..

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:50 PM

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. చాలా ప్రాంతాల్లో నీటి కొరత మొదలైపోతుంది. మన దేశంలోని మహా నగరాలు నీటి కోసం విలవిలలాడుతాయి. వేసవి ప్రారంభానికి ముందే బెంగళూరు వాసులు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. వాడుకోవడానికి, తాగడానికి నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు.

Viral Video: ఈ ట్రిక్ ఏదో బాగుందే.. గిన్నెలను కడిగేందుకు నీరు లేక ఓ వ్యక్తి ఎలా తింటున్నాడో చూడండి..
ప్లాస్టిక్

వేసవి (Summer) కాలం వచ్చిందంటే చాలు.. చాలా ప్రాంతాల్లో నీటి కొరత మొదలైపోతుంది. మన దేశంలోని మహా నగరాలు నీటి కోసం విలవిలలాడుతాయి (Water problem). వేసవి ప్రారంభానికి ముందే బెంగళూరు వాసులు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. వాడుకోవడానికి, తాగడానికి నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka) ఓ ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. నీటి వాడకాన్ని తగ్గించేందుకు, పాత్రలను (Utensils) కడిగే అవసరం లేకుండా చేసేందుకు ఓ ఉపయోగిస్తున్న ట్రిక్ (Trick) చాలా మందిని ఆకట్టుకుంటోంది (Viral Video).


వైరల్ అవతున్న ఆ వీడియోలోని వ్యక్తి ప్లేట్‌లో అన్నం వడ్డించుకోడానికి సిద్ధమయ్యాడు. అయితే తిన్న తర్వాత పాత్రలు కడగాలని గ్రహించాడు. పాత్రలను కడగనవసరం లేకుండా ఓ ప్లాన్ వేశాడు. తన ప్లేట్, స్పూన్, గ్లాస్‌లకు కవర్లు చుట్టేశాడు. తినడం పూర్తయిన తర్వాత ఆ ప్లాస్టిక్ కవర్‌ను సులభంగా తీసిపారేశాడు. పాత్రలను శుభ్రంగా రాక్‌లో సర్దేశాడు. ఈ ట్రిక్ చాలా మందిని ఆకట్టుకుంటోంది. ``పాత్రలను కడగడానికి అవసరమైన నీరు లేనపుడు`` అంటూ హర్ష్ గోయెంకా ఈ వీడియోను షేర్ చేశారు.


ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను కొద్ది సేపట్లోనే 73 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ప్రస్తుత పరిస్థితులకు ఇది మంచి పరిష్కారం``, ``ఇది పర్యావరణానికి చాలా హానికరం``, ``బెంగళూరులో చాలా మంది ఇలాంటి ట్రిక్కులనే వాడుతూ నీటిని పొదుపు చేసుకుంటున్నారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. పులితో ఆటంటే ఇలా ఉంటుందా? ఒళ్లు గగుర్పొడిచే వీడియో చూడండి..!


Puzzle: మీ బ్రెయిన్‌కు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో ఉన్న తప్పేంటో 6 సెకెన్లలో కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 17 , 2024 | 12:50 PM