Share News

White Teeth: ఇలా చేశారంటే.. గారపట్టిన దంతాలు మిళమిళా మెరవాల్సిందే..

ABN , Publish Date - Apr 24 , 2024 | 07:14 PM

సినిమా కొటేషన్స్‌ని పక్కన పెట్టేస్తే.. వాస్తవ జీవితంలో ప్రతిఒక్కరూ నలుగురిలో అందంగా కనిపించాలని కోరుకుంటుంటారు. అందుకోసం ముఖానికి ఏవేవో క్రీములు రాస్తుంటారు. కేవలం ముఖానికే కాదండోయ్.. దంతాల విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మొఖానికి ఎంత మేకప్ చేసుకున్నా..

White Teeth: ఇలా చేశారంటే.. గారపట్టిన దంతాలు మిళమిళా మెరవాల్సిందే..

సినిమా కొటేషన్స్‌ని పక్కన పెట్టేస్తే.. వాస్తవ జీవితంలో ప్రతిఒక్కరూ నలుగురిలో అందంగా కనిపించాలని కోరుకుంటుంటారు. అందుకోసం ముఖానికి ఏవేవో క్రీములు రాస్తుంటారు. కేవలం ముఖానికే కాదండోయ్.. దంతాల విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మొఖానికి ఎంత మేకప్ చేసుకున్నా.. ఎన్ని క్రీములు రాసుకున్నా.. పళ్ల వరుస సరిగా లేకంటే ప్రయోజనం ఉండదు. అందులోనూ దంతాలు పసుపు రంగులో ఉంటే చూడటానికి కూడా బాగుండదు. చాలా మంది గారపట్టిన దంతాలతో పది మందిలో మనస్ఫూర్తిగా నవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసం కొన్ని సింపుల్ టిప్స్ తీసుకొచ్చాం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


చాలా మంది అందం విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా కూడా.. దంతాల (Dental care) సంరక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా ఆహార అలవాట్ల కారణంగా సమస్యలు కొనితెచ్చుకుంటుంటారు. టీ, కాఫీలు, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడంతో పాటూ ధూమపానం చేస్తుండడం వల్ల దంతాలు పాడవుతుంటాయి. మరికొందరు ఆహారం తిన్న తర్వాత సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల కూడా దంతాలు పసుపురంగులోకి మారడం, పుచ్చిపోవడం జరుగుతుంటుంది. తీరా జరగాల్సిన నష్టం జరిగాక.. తెగ ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి వారు ఇప్పటికైనా పైన చెప్పిన అలవాట్లకు దూరంగా ఉంటూ.. కొన్ని చిట్కాలు పాటిస్తే, మళ్లీ దంతాలను మెరిసేలా చేయవచ్చు అన్నమాట.


baking-soda.jpg

బేకింగ్ సోడాతో ఇలా చేయండి..

బేకింగ్ సోడా, నిమ్మరసం మిశ్రమంతో దంతాలు తెల్లగా చేయవచ్చు. ఒక గిన్నెలో 1 టీస్పూన్ బేకింగ్ సోడా, సరిపడా నిమ్మరసం కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను మీ బ్రష్‌పై ఉంచి దంతాలను శుభ్రపరచుకోవాలి. ఇలా రెండు, మూడు వారాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బేకింగ్ సోడా నోటి లోని హానికర బ్యాక్టీరియాను తొలగించడంలో సాయపడుతుంది.

vinegar.jpg

వెనిగర్‌తో ఇలా చేస్తే చాలు..

బేకింగ్ సోడా, నిమ్మరసం మిశ్రమంతో పాటూ వైట్ వెనిగర్‌ కూడా పసుపు పచ్చ దంతాలకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు నీటిలో వైట్ వెనిగర్‌ని మిక్స్ చేయాలి. తర్వాత ఆ నీటిని పుక్కిలించాలి. ఇలా చేస్తే పచ్చగా ఉన్న దంతాలు కాస్తా.. క్రమక్రమంగా తెల్లగా మారతాయి. దీంతో పాటూ నోటి దుర్వాసన కూడా పోతుంది.


white-teeth-treatment.jpg

క్యారెట్, పుదీనాతో..

ముందుగా ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ట‌మాటో జ్యూస్‌, ఒక స్పూన్ క్యారెట్ జ్యూస్‌, రెండు స్పూన్ల టూత్ పేస్ట్‌, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక టేబుల్ స్పూన్ పుదీనా జ్యూస్ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో రెండు, మూడు నిముషాల పాటు బ్రష్ చేసుకోవాల. ఇలా కొన్ని రోజులు చేయగానే ఫలితం కనపడుతుంది.

salt-water.jpg

ఉప్పు నీటితో..

దంతాలపై గారను తొలగించడంలో ఉప్పు నీరు కూడా ఎంతో సాయపడుతుంది. ఓ కప్పు గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని నోట్లో వేసుకుని నిముషం పాటు పుక్కలిస్తే చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది. రోజుకు ఒకటి, రెండు సార్లు ఇలా చేస్తూ ఉంటే క్రమంగా దంతాలపై ఉన్న గార పోయి శుభ్రమవుతాయి.

coconut-oil.jpg

కొబ్బరినూనెతో..

కొబ్బరినూనె ద్వారా కూడా దంతాలకు ఎంతో మేలు కలుగుతుంది. నోట్లో కొబ్బిరినూనెను పోసుకుని కొన్ని నిముషాల పాటు పుక్కిలిస్తే మంచి ఫలితం ఉంటుంది. కనీసం రోజుకు ఒకసారి అయినా ఇలా చేస్తే.. దంతాలలో ఉన్న చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది.

Updated Date - Apr 24 , 2024 | 07:14 PM