Share News

AP Elections 2024:అరటిపండు తొక్కలాగా.. జగన్ ప్రభుత్వాన్ని చెత్తబుట్టలో పడేయాలి: పవన్ కళ్యాణ్

ABN , Publish Date - Apr 28 , 2024 | 09:11 PM

అరటిపండు తొక్కలాగా.. జగన్ ప్రభుత్వాన్ని చెత్తబుట్టలో పడేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సెటైర్లు గుప్పించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

AP Elections 2024:అరటిపండు తొక్కలాగా.. జగన్ ప్రభుత్వాన్ని చెత్తబుట్టలో పడేయాలి: పవన్ కళ్యాణ్

కాకినాడ: అరటిపండు తొక్కలాగా.. జగన్ ప్రభుత్వాన్ని చెత్తబుట్టలో పడేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సెటైర్లు గుప్పించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. జగన్ ప్రభుత్వానికి ఎందుకు ఓటేవేయాలన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికుల నిధులు మాయం చేసింనందుకు ఆయనకు ఓటు వేయాలా అని నిలదీశారు.

AP Elections 2024: ఏపీ రాజకీయాలపై జయప్రద ఇంట్రస్టింగ్ కామెంట్స్..


వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. దళితుల కోసం గత టీడీపీ ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టిందని.. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలను ఎత్తేసి నిధులు మళ్లించారని విరుచుకుపడ్డారు. రైతులకు సాగు, తాగునీరు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు పెట్టారని ఫైర్ అయ్యారు. డీఎస్సీ ఇవ్వకుండా నిరుద్యోగులను జగన్ మోసం చేశారని దుయ్యబట్టారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ప్రతి వర్గానికి మేలు చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఏలేశ్వరంలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ ప్రసంగాన్ని ఏబీఎన్- ఆంధ్రజ్యోతిలో వీక్షిచండి.

ఇవి కూడా చదవండి

AP Elections 2024: ఓటు ఎవరికి వేశామో తెలుసుకోవచ్చు.. రండి ఇలా చెక్ చేసుకోండి!!

AP Elections: నీ అభిమానానికి ఫిదా.. చంద్రబాబు కోసం ఈయన ఏం చేశాడంటే..

Sharmila: సీఎం జగన్.. లాయర్ పొన్నవోలు మధ్య క్విడ్ ప్రోకో

Read Latest Andhra pradesh News or Telugu News

Updated Date - Apr 28 , 2024 | 10:04 PM