Share News

Viral Video: అయ్యో.. ఎంత ఘోరం..! శ్మశానవాటిక పక్కనే కూర్చుని ఉండగా.. ఉన్నట్టుండి..

ABN , Publish Date - Apr 24 , 2024 | 08:39 PM

సంతోషంగా ఉన్న సమయంలో కొన్నిసార్లు విధికి కన్ను కుడుతుంటుంది. దీంతో అప్పటిదాకా ఉన్న ఆనందం కాస్తా.. ఒక్కసారిగా ఆవిరైపోతుంటుంది. కొన్నిసార్లు ఆనందంగా ఉన్న సమయంలో ఉన్నట్టుండి విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా వీడియోలు...

Viral Video: అయ్యో.. ఎంత ఘోరం..! శ్మశానవాటిక పక్కనే కూర్చుని ఉండగా.. ఉన్నట్టుండి..

సంతోషంగా ఉన్న సమయంలో కొన్నిసార్లు విధికి కన్ను కుడుతుంటుంది. దీంతో అప్పటిదాకా ఉన్న ఆనందం కాస్తా.. ఒక్కసారిగా ఆవిరైపోతుంటుంది. కొన్నిసార్లు ఆనందంగా ఉన్న సమయంలో ఉన్నట్టుండి విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కొంత మంది శ్మశానవాటిక పక్కన కూర్చుని సంతోషంగా మాట్లాడుతుండగా.. ఉన్నట్టుండి విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘అయ్యో.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Videos) తెగ వైరల్ అవుతోంది. హర్యానా (Haryana) పరిధి గురుగ్రామ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక అర్జున్ నగర్‌లో శ్మశాన వాటిక గోడ పక్కన కొంత మంది కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్నారు. 11 ఏళ్ల బాలిక సహా మరో ముగ్గురు వృద్ధులు కూర్చుని మాట్లాడుతుండగా.. ఆ పక్కనే మరో వ్యక్తి దూరంగా నిలబడి మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. శ్మశాన వాటిక గోడ ఒక్కసారిగా కూలి (wall collapsed) కూర్చున్న వారిపై పడింది. గోడ పడడం గమనించిన వృద్ధులు.. కుర్చీల్లోంచి లేచి పక్కకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే గోడ మొత్తం కూలి వారిపై పడింది.

Viral Video: ఇలా ఉండడం ఎంతమందికి సాధ్యం.. కష్టంలోనూ ఆనందం వెతుక్కోవడం అంటే ఇదే..

గోడ కూలిన సమయంలో వారి పక్కనే నిలబడి ఉన్న వ్యక్తి వేగంగా వెనక్కు జరిగి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ ప్రమాదంలో గోడ పక్కన కూర్చున్న నలుగురూ తీవ్ర గాయాలతో మృత్యువాత పడ్డారు. చుట్టు పక్కల వారు వారిని అతి కష్టం మీద బయటికి తీసి, ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందారని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డ మరో వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. మృతి చెందిన వారిలో తాన్య (11), దేవి దయాల్ (70), మనోజ్ గబా (54) కృష్ణ కుమార్ (52) ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ‘‘అయ్యో.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘విధి ఎంత విచిత్రమైంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Wife: చెల్లెలికి టీవీ కొనిచ్చాడని.. భార్య స్కెచ్.. చివరకు ఎవరూ ఊహించని షాకింగ్ సీన్..

Updated Date - Apr 24 , 2024 | 08:39 PM