Share News

Loksabha Polls: తెలంగాణలో బీజేపీ అగ్రనేతల వరుస పర్యటనలు... మోదీ షెడ్యూల్ ఇదే!

ABN , Publish Date - Apr 25 , 2024 | 10:32 AM

Telangana: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కమలం పార్టీ స్పీడప్ చేసింది. తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ.. అందుకు తగిన ప్రణాళికలను రూపొందించింది. తెలంగాణలో బీజేపీ అగ్రనేతల పర్యటనలు నిర్వహించేలా ప్లాన్ సిద్ధం చేసింది. అందులో భాగంగా తెలంగాణలో బీజేపీ జాతీయ నేతలు వరుసగా పర్యటించనున్నారు.

Loksabha Polls: తెలంగాణలో బీజేపీ అగ్రనేతల వరుస పర్యటనలు... మోదీ షెడ్యూల్ ఇదే!
BJP National Leaders Election Camapaign

హైదరాబాద్, ఏప్రిల్ 25: పార్లమెంట్ ఎన్నికల్లో (Loksabha Elections 2024) గెలుపే లక్ష్యంగా బీజేపీ (BJP) దూకుడు పెంచింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కమలం పార్టీ స్పీడప్ చేసింది. తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ.. అందుకు తగిన ప్రణాళికలను రూపొందించింది. తెలంగాణలో బీజేపీ అగ్రనేతల పర్యటనలు నిర్వహించేలా ప్లాన్ సిద్ధం చేసింది. అందులో భాగంగా తెలంగాణలో బీజేపీ జాతీయ నేతలు వరుసగా పర్యటించనున్నారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) రాష్ట్రానికి రానున్నారు. ఈనెల 30, మే 3, 4 తేదీల్లో మోదీ పర్యటన సాగనుంది. తెలంగాణ స్టేట్ బీజేపీ నేతలు అందుకు తగిన ఏర్పాట్లలో బిజీబిజీగా గడుపుతున్నారు.

AP Elections: విజయవాడ వెస్ట్‌లో సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం... వైసీపీ పాలనపై సుజనా ఫైర్


పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 30న హైదరాబాద్‌లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశంకానున్నారు. మే3న సుల్తాన్ పూర్‌లో బీజేపీ విశాల జనసభలో పీఎం ప్రసంగిస్తారు. మే 4న నారాయణ పేట్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు. అలాగే ఈరోజు కేంద్రమంత్రి అమిత్‌ షా (Amit Shah) తెలంగాణలో పర్యటించనున్నారు. ఈరోజు నేడు సిద్ధపేట బహిరంగ సభలో షా పాల్గొననున్నారు. వీరితో పాటు తెలంగాణలో నడ్డా, యూపీ సీఎం యోగీ ప్రచారం నిర్వహించనున్నారు. బీజేపీ కేడర్‌లో మరింత ఉత్సాహం నింపేలా అగ్రనేతల ఎన్నికల ప్రచారం ఉండబోతోందని స్టేట్ బీజేపీ నేతలు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి....

Lok Sabha Polls: రాజాసింగ్‌ డుమ్మా వెనుక ఉన్న మతలబు ఏమిటో..?

YSRCP: వైసీపీ అభ్యర్థుల్లో ఓటమి అసహనం.. బూతులు తిట్టేస్తున్నారు!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 25 , 2024 | 10:37 AM